వాట్సాప్ లో మరో నాలుగు అద్భుతమైన ఫీచర్స్….!

-

వాట్సాప్ సంస్థ ఈ మధ్య కాలంలో ఎక్కువగా తన యాప్ ని అప్డేట్ చేస్తూ వస్తుంది. దీని వినియోగదారులు రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది సంస్థ. ఇప్పుడు మరో నాలుగు ఫీచర్లను జోడించడానికి గాను సిద్దమైంది.

వీడియో కాలింగ్‌లో ఎక్కువ పార్టిసిపెంట్స్‌ని యాడ్ చేయడమే కాకుండా… అడ్వాన్స్ సెర్చ్, బ్యాకప్ పాస్‌వర్డ్ ప్రొటెక్షన్, ఆటో డౌన్‌లోడ్ రూల్స్ లాంటి ఫీచర్స్‌ని రిలీజ్ చేయనుంది.

ప్రస్తుతం వీడియో కాలింగ్ యాప్స్‌కు డిమాండ్ బాగా పెరిగిన నేపధ్యంలో వీడియో కాల్ చెయ్యాలి అంటే ఈ యాప్ లో నలుగురికి మించి అవకాశం ఉండదు. అందుకే పార్టిసిపెంట్స్ సంఖ్య పెంచింది సంస్థ. వాట్సప్ బీటా ఆండ్రాయిడ్ 2.20.128 వర్షన్ అప్‌డేట్ చేసినవారికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Advance Search: వాట్సప్‌లో మెసేజెస్, ఫోటోస్, వీడియోస్, గిఫ్ ఫైల్స్ వస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో వాట్సప్‌లో ఫేక్ న్యూస్ ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు అడ్వాన్స్ సెర్చ్ ఫీచర్‌ని రూపొందిస్తోంది వాట్సప్. మీకు వచ్చిన మెసేజ్‌ను అక్కడే సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది.

Backup Password Protection: గూగుల్ డ్రైవ్‌లోని మీ ఛాట్ బ్యాకప్స్‌కి పాస్‌వర్డ్ సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఛాట్ బ్యాకప్ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ ఆన్ చేస్తే మీ ఛాట్ బ్యాకప్స్ అన్నీ పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ అవడంతో భద్రత పెరుగుతుంది.

Auto Download Rules: ఫార్వర్డ్ మెసేజెస్ వేల కొద్దీ వస్తు ఉంటాయి. అవసరం లేని ఫోటోలు, వీడియోలు ఎక్కువగా వస్తాయి. ఫార్వర్డ్ అయ్యే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, వాయిస్ మెసేజెస్ ఆటో డౌన్‌లోడ్ కాకుండా డిసేబుల్ చేసే ఆప్షన్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news