అమెజాన్‌లో గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్‌.. త‌క్కువ ధ‌ర‌ల‌కే ఫోన్లు..

-

రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ సేల్ ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఇందులో భాగంగా అనేక ఉత్ప‌త్తుల‌ను ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర‌ల‌కు విక్ర‌యించ‌నున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఎల‌క్ట్రానిక్ ఉప‌క‌ర‌ణాలు, స్మార్ట్ టీవీలు, ఓవెన్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో ఉత్ప‌త్తులు, కెమెరాలు, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూట‌ర్స్, స్మార్ట్ వాచ్‌లు, ప్రింట‌ర్లు, ఇయ‌ర్ ఫోన్స్ త‌దిత‌ర అనేక ఉత్ప‌త్తుల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కే విక్ర‌యించ‌నున్నారు.

great republic day sale in amazon

ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ల‌కు 24 గంట‌ల ముందుగానే అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా ఎస్‌బీఐకి చెందిన క్రెడిట్‌, డెబిట్ కార్డులు ఉన్న‌వారు అద‌నంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అలాగే బ‌జాజ్ ఈఎంఐ కార్డ్‌, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్‌, అమెజాన్ పే లేట‌ర్ వంటి ఫీచ‌ర్లు అందుబాటులో ఉన్నాయి.

సేల్‌లో భాగంగా యాపిల్‌కు చెందిన ఐఫోన్ 12 మినీ రూ.10వేల డిస్కౌంట్‌లో ల‌భ్యం కానుంది. అదేవిధంగా ఐఫోన్ 7, 12, యాపిల్ వాచ్ సిరీస్ 3, యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రొ ల‌పై రాయితీల‌ను అందిస్తారు. నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా ల‌భిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news