మీ కంప్యూట‌ర్‌లో ఉన్నజిప్ ఫైల్స్ కు పాస్‌వ‌ర్డ్‌ను ఈ విధంగా తొల‌గించండి..!

కంప్యూట‌ర్ల‌లో జిప్ ఫైల్స్ వాడ‌కం పెరుగుతోంది. అనేక ఫైల్స్ అన్నింటినీ క‌లిపి ఒకే ఫైల్ లో జిప్ చేసి పంపే వెసులు బాటు ఉంటుంది. పైగా ఫైల్ సైజ్ కూడా త‌గ్గుతుంది. క‌నుక చాలా మంది జిప్ ఫైల్స్ ను వాడుతున్నారు. అయితే కొన్నిసార్లు వీటికి పాస్‌వ‌ర్డ్‌లు ఉంటాయి. వాటిని మ‌రిచిపోతే చాలా క‌ష్టం. అయితే కింద తెలిపిన స్టెప్స్ ను పాటిస్తే జిప్ ఫైల్స్ కు ఉండే పాస్‌వ‌ర్డ్‌ల‌ను సుల‌భంగా తొల‌గించ‌వ‌చ్చు. మ‌రి ఆ స్టెప్స్ ఏమిటంటే..

1. PassFab అనే సాఫ్ట్‌వేర్‌ను ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందుకు గాను గూగుల్ లో సెర్చ్ చేసి సాఫ్ట్‌వేర్‌ను వెదికి ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.

2. సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేశాక ఓపెన్ చేయాలి. దీంతో మెయిన్ ఇంట‌ర్ ఫేస్ వ‌స్తుంది.

3. అందులో మీకు కావ‌ల్సిన పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్ట్ చేయ‌బ‌డిన ఫైల్‌ను Add అనే బ‌ట‌న్ ద్వారా వెదికి యాడ్ చేయాలి.

4. అనంత‌రం Brute Force Attack, Brute Force with Mask Attack, Dictionary Attack అనే ఆప్ష‌న్ల‌లో దేన్న‌యినా ఎంచుకోవాలి. ఇవి పూర్త‌య్యేందుకు భిన్న ర‌కాల స‌మ‌యాలు ప‌డతాయి.

5. పాస్‌వ‌ర్డ్ రిక‌వ‌రీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఎంచుకున్న మోడ్‌ను బ‌ట్టి కొన్ని నిమిషాలు లేదా గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. త‌రువాత తెర‌పై ఆ జిప్ ఫైల్‌కు ఉండే పాస్‌వ‌ర్డ్ చూపించ‌బ‌డుతుంది. దాన్ని కాపీ చేసి అనంత‌రం జిప్ ఫైల్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేసేట‌ప్పుడు ఉప‌యోగించ‌వ‌చ్చు.

అయితే PassFab మాత్ర‌మే కాదు, ఆన్ లైన్ లో ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ చాలా ల‌భిస్తున్నాయి. వాటిని ట్రై చేయ‌వ‌చ్చు. జిప్ ఫైల్‌ పాస్‌వ‌ర్డ్ ఎక్స్‌ట్రాక్ట‌ర్ (zip file password extractor) అని టైప్ చేసి గూగుల్‌లో వెదికితే ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ వ‌స్తాయి. ఒకటి ప‌నిచేయ‌పోయినా ఇంకొక‌టి ట్రై చేయ‌వ‌చ్చు. దీంతో జిప్ ఫైల్స్ కు ఉండే పాస్‌వ‌ర్డ్‌ల‌ను రిక‌వ‌ర్ చేయ‌గలుగుతాము.