మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌లో యూపీఐ ఆటోపే ను ఈ విధంగా సెట్ చేసుకోండి..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న టాప్ 10 స్ట్రీమింగ్ యాప్‌ల‌లో నెట్‌ఫ్లిక్స్ ఒక‌టి. దీనికి ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం 15 కోట్ల‌కు పైగానే ఖాతాదారులు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో అనేక మూవీలు, సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆర్‌బీఐ నిబంధ‌న‌ల కార‌ణంగా ఇక‌పై క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా నెల నెలా ఖాతా రుసుము చెల్లించ‌డం వీలు కాదు. కానీ ఈ స‌మ‌స్య‌కు నెట్‌ఫ్లిక్స్ యూపీఐ ఆటో పే ఫీచ‌ర్‌ను ప‌రిష్కారంగా అందుబాటులోకి తెచ్చింది.

నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉన్న‌వారు ఇక‌పై క్రెడిట్‌, డెబిట్ కార్డుల ద్వారా నెల‌వారీగా ఖాతా స‌బ్‌స్క్రిప్ష‌న్ రుసుము చెల్లించ‌లేరు. కానీ యూపీఐ ఆటోపే ద్వారా సుల‌భంగా ఆ ఫీజు చెల్లించ‌వ‌చ్చు. అందుకు గాను యూజ‌ర్లు త‌మ నెట్‌ఫ్లిక్స్‌ ఖాతాల్లో యూపీఐ ఆటోపే ఫీచ‌ర్‌ను సెట్ చేసుకోవాలి. అందుకు కింద తెలిపిన స్టెప్స్‌ను పాటించాలి.

1. మీ ఫోన్‌లో నెట్‌ఫ్లిక్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.

2. ప్రొఫైల్‌లోకి వెళ్లి అక్క‌డ స్క్రీన్‌పై టాప్‌లో ఎడ‌మ వైపు ఉండే ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.

3. మై లిస్ట్‌లో ఉండే అకౌంట్ ఆప్ష‌న్‌పై ట్యాప్ చేయాలి.

4. ఇప్పుడు మీరు Netflix.com లో మీ అకౌంట్ పేజీకి రీడైరెక్ట్ చేయ‌బ‌డతారు.

5. లిస్ట్‌లో ఉండే మేనేజ్ పేమెంట్ ఇన్ఫోపై ట్యాప్ చేయాలి.

6. చేంజ్ పేమెంట్ మెథ‌డ్‌పై ట్యాప్ చేయాలి.

7. చివ‌రిగా, యూపీఐ ఆటో పే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

ఇలా నెట్‌ఫ్లిక్స్‌లో యూపీఐ ఆటో పే ఆప్ష‌న్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. దీంతో క్రెడిట్‌, డెబిట్ కార్డుల ద్వారా కాకుండా యూపీఐ ద్వారా నెల నెలా సుల‌భంగా స‌బ్‌స్క్రిప్ష‌న్ రుసుం చెల్లించ‌వ‌చ్చు.