పవర్‌ బ్యాంక్‌ వాడుతున్నవారికి అలర్ట్‌!

పవర్‌ బ్యాంక్‌ వాడుతున్నట్టయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సాధరణంగా పవర్‌ బ్యాంక్‌లు మనం ఎక్కడికైన బయటకి వెళ్లినప్పుడు తీసుకెళ్తాం. ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి ఇది తప్పనిసరి. ఈ పోర్టబుల్‌ పవర్‌ ఛార్జర్‌ను స్మార్ట్‌ ఫోన్లు, కెమెరా, స్మార్ట్‌ వాచ్‌ ఇతర గ్యాడ్జెట్లకి వాడతాం. కానీ, మీరు ఎప్పుడు పవర్‌ బ్యాంక్‌ ను ఉపయోగించిన ఒక విషయం గుర్తుంచుకోండి. పవర్‌ బ్యాంక్‌ను ఫుల్‌ ఛార్జ్‌ చేయాలి. ఏ గ్యాడ్జెజ్‌ ఛార్జి చేయాలనుకుంటే దాని బ్యాటరీకి రెండు రెట్లు ఎక్కువగా పవర్‌ బ్యాంక్‌ ఛార్జ్‌ అయి ఉండాలి.


ఒకవేళ మీ ఫోన్‌ 4 వేల ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంటే అప్పుడు మీరు ఉపయోగించే పవర్‌ బ్యాంక్‌ సామర్థ్యం 10 వేల ఎంఏహెచ్‌ ఉండేలా చూసుకోవాలి. దీంతో ఛార్జ్‌ చేసినా మీకు వచ్చే అవుట్‌పుట్‌ కేవలం 8 వేల ఎంఏహెచ్‌ మాత్రమే. అంటే 20 శాతం మేర అవుట్‌పుట్‌ తక్కువగా వస్తుంది. సాధరణంగా ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లలో 6 వేల ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. అయితే దీనికి మీరు 10 వేల ఎంఏహెచ్‌ బ్యాటరీ పవర్‌ బ్యాంక్‌ ను ఉపయోగించాల్సి ఉంటుంది. అది కూడా ఒక్కసారి ఛార్జ్‌ చేయడానికి. బ్యాటర్‌ సామర్థ్యం ఎక్కువ ఉన్న స్మార్ట్‌ ఫోన్లను తీసుకున్నట్లయితే మీకు పవర్‌ బ్యాంక్‌ వాడే అవసరం ఉండదు. తరచూ ప్రయాణాలు చేసేవారు ఛార్జింగ్‌ అందుబాటులో లే కుంటే పవర్‌ బ్యాంక్‌ కొనవచ్చు. అలాంటి వారు 20 వేల ఎంఏహెచ్‌ సామర్థ్యం ఉన్న పవర్‌ బ్యాంక్‌ తీసుకుంటే రెండు మూడు సార్లు ఛార్జ్‌ చేసుకోవచ్చు.

పవర్‌ బ్యాంక్‌ పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి ఎంత సమయం పడుతుందనేది దాని కెపాసిటీపై ఆధారపడుతుంది.
10,000ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంక్‌ ఫుల్‌ ఛార్జ్‌ చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ చేసే అడాప్టర్‌ ఉపయోగిస్తే పవర్‌ బ్యాంక్‌ త్వరగా ఫుల్‌ అవుతుంది.

మీరు ఫోన్‌ కొన్నప్పుడు వచ్చిన ఫాస్ట్‌ ఛార్జర్‌తో పవర్‌ బ్యాంక్‌ ఛార్జ్‌ చేయొచ్చు. పవర్‌ బ్యాంక్‌ రోజూ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీకు ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా మీ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జ్‌ చేయడం మంచిది.
పవర్‌ బ్యాంక్‌లు కొనే ముందు ఎంత త్వరగా స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జ్‌ అవుతుందో లేదో చూడాలి. దీనికి సర్క్యూట్‌ ప్రొటెక్షన్‌ కూడా ఉండాలి. మాములుగా అయితే డిజిటల్‌ డిస్‌ ప్లే ఉన్న పవర్‌ బ్యాంక్‌లు తీసుకోవాలి. దీంతో ఎంత శాతం ఛార్జింగ్‌ అయిపోయింది కూడా తెలుస్తుంది. సాధారణంగా పవర్‌ బ్యాంక్‌లో నాలుగు ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. ఒకవేళ ఒక్క లైట్‌ మాత్రమే వెలిగితే దాదాపు ఛార్జింగ్‌ అయిపోయినట్లే.