ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర కేవ‌లం రూ.7,199 మాత్ర‌మే..!

Join Our Community
follow manalokam on social media

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్ కొత్త‌గా స్మార్ట్ 5 పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను గురువారం మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ఇందులో 6.82 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే ను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 గో ఎడిష‌న్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉండ‌గా, ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక‌వైపు ఏర్పాటు చేశారు. డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ల‌ను అమ‌ర్చారు. 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందిస్తున్నారు.

Infinix Smart 5 smart phone launched

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 ఫీచ‌ర్లు…

* 6.82 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1640 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెస‌ర్‌, 2జీబీ ర్యామ్
* 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10 గో ఎడిష‌న్‌, డ్యుయ‌ల్ సిమ్
* 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డీటీఎస్ హెచ్‌డీ స‌రౌండ్ సౌండ్
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 స్మార్ట్ ఫోన్ రూ.7,199 ధ‌ర‌కు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 18వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...