ఇదే యూట్యూబ్ ఫస్ట్‌ వీడియో.. నేటికి 15 ఏళ్ళు…!

-

యుట్యూబ్… మన జీవితంలో ప్రతీ రోజు ఏదోక సందర్భంలో దీన్ని వాడుతూనే ఉంటాం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు కూడా దీనిని వినియోగిస్తూ ఉంటారు. వినోదం కోసం, వ్యాపారం కోసం, సమాచారం కోసం, చదువు కోసం ఇలా ఎన్నో రకాలుగా దీన్ని వాడుతూ ఉంటారు జనాలు. మన జీవితంలో భాగం అయిపోయిన దానిలో ఇది కూడా ఒకటి. గూగుల్ సంస్థకు చెందిన యుట్యూబ్ ఆ స్థాయిలో పాపులర్ అయింది.

ఈ యుట్యూబ్ మొదలై నేటికి సరిగా 15 ఏళ్ళు అయింది. మొట్టమొదటి యూట్యూబ్ వీడియో ఏప్రిల్ 23, 2005 న అప్‌లోడ్ చేసారు. యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం 18 సెకన్ల వీడియోను “మి ఎట్ ది జూ” పేరుతో పోస్ట్ చేశారు. అప్పటి నుండి ఇది 90 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది ఈ వీడియో. ఆయన ఛానల్ లో ఇప్పటి వరకు ఇది ఒక్క వీడియో నే పోస్ట్ చేసారు. కాని యుట్యూబ్ మాత్రం బాగా పాపులర్ అయింది.

వీడియో ని క్లిక్ చేసిన తర్వాత కరీం మొహం కనపడుతుంది. అక్కడి నుంచి వీడియో మొదలవుతుంది. తాము ఏనుగుల ముందు ఉన్నామని చెప్పాడు. “మీ ఎట్ జూ” అనే వీడియో ని పోస్ట్ చేసిన తర్వాత కరీం మరియు తోటి సహ వ్యవస్థాపకులు ఈ ప్లాట్‌ఫామ్‌ను గూగుల్‌కు 1.65 బిలియన్లకు విక్రయించారు. ప్రతిరోజూ ఒక బిలియన్ గంటల కంటెంట్ తాము అందిస్తున్నామని, ఇక తమకు ప్రతీ రోజు 200 కోట్ల మంది యుట్యూబ్ చూస్తున్నారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news