సెటైర్: వైసీపీకి వచ్చినవి 151 సీట్లే సోమిరెడ్డి!

-

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం రోజు రోజుకీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో… రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఏమాత్రం అర్ధరహితంగా ఉన్నా, ఏమాత్రం కాస్త లూజ్ టంగ్ తో మాట్లాడినా… ట్రోల్ అయిపోవడం ఖాయం! ఈ విషయంపై అవగాహన లేకో… నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న ఆలోచనో తెలియదు కాని… కొందరు టీడీపీ నేతలు ఇలాంటి అనాలోచిత విమర్శలు చేస్తున్నారు. దీంతో… సోషల్ మీడియా జనాలు ఒక ఆటాడుకుంటున్నారు. తాజాగా ఇలా దొరికన నాయకుడు… సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంట! ఆ కథాకమీషు ఏమితో ఇప్పుడు చూద్దాం!

తాజాగా ఏపీ సర్కార్‌ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారంట. ప్రమాదకరమైన కరోనా వ్యాధిని కంట్రోల్ చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని.. పాలనలో విఫలమైన ప్రభుత్వం చేతులెత్తేసినట్టు కనిపిస్తోందని.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిస్సహాయంగా మిగిలిపోయారని.. ఎమ్మెల్యేలు మత్రం బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఒక రేంజ్ లో విమర్శలు గుప్పించారట. అక్కడితో ఆగారా… ఇంకో అడుగు ముందుకేసి… అసలు రాష్ట్రంలో కరోనా రావడానికి, కేసులు పెరగడానికీ వైకాపా ఎమ్మెల్యేలే కారణం అన్న రేంజ్ లో ఫైరయ్యారంట. అంతవరకూ బాగానే ఉంది కానీ… అనంతరం శృతిమించిన అసహనంలో భాగంగా అన్నారో లేక భవిష్యత్తుపై బ్రహ్మం గారి ఆలోచనలు ఏమైనా చేశారో ఏమో కానీ… 175 నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలు ఎవరైనా డబ్బులు వసూళ్లు చేసుకోవచ్చు.. ఊరేగింపూలు చేయవచ్చు అని బహిరంగంగా చెప్పేయండని ఎద్దేవా చేశారంట! ఇదిగో సరిగ్గా ఇక్కడే సోమిరెడ్డి దొరికిపోయారు అంటున్నారు నెటిజన్లు!

2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ గెలుచుకున్నవి 151 సీట్లు కాగా… 23 టీడీపీ, 1 జనసేన గెలుచుకున్న సంగతి తెలిసిందే! ఈ విషయం మరిచారో లేక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తుపై ఒక అవగాహన తెచ్చుకున్నారో ఏమో కానీ… 175 నియోజకవర్గాల్లోని వైకాపా ఎమ్మెల్యేలు అని టంగ్ స్లిప్పయ్యారంట సోమిరెడ్డి! దీంతో… కనీసం చంద్రబాబు సీటు అయినా ఆపి 174 అనొచ్చు కదా సోమిరెడ్డి… అని సెటైర్ల వర్షాలు కురుస్తున్నాయట. ఈ రోజుల్లో నాయకులు చాలా జాగ్రత్తగా… ఆచితూచి మాట్లాడాలి సుమా… లేదంటే ట్రోల్ అయిపోతారు మరి!!

కాగా… 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. వరుసగా నాలుగు సార్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమి పాలైన సంగతి తెలిసిందే!

Read more RELATED
Recommended to you

Latest news