జియో బంపర్‌ ఫీచర్‌ .. డేటా అయిపోతే ఇన్‌స్టంట్‌ డేటా లోన్‌.. పే లేట‌ర్‌

-

టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ( JIO ) తన వినియోగదారులకు బంపర్‌ ఫీచర్‌ను అందిస్తోంది. ఎమర్జెన్సీ డేటా లోన్‌ పేరిట ఓ నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా మొబైల్‌ డేటాను వినియోగదారులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో డేటా చాలా త్వరగా అయిపోతుంది. అయితే డేటా కావాలంటే వెంటనే ఇంకో ప్లాన్‌నో లేదా డేటా ప్యాక్‌నో రీచార్జి చేసుకోవాలి. కానీ రీచార్జి చేసుకునే సమయం లేకపోయినా, రీచార్జి చేయలేకపోయినా ఫర్వాలేదు. జియో వెంటనే ఇన్‌స్టంట్‌ డేటా లోన్‌ను ఇస్తుంది. దీంతో అప్పటికప్పుడు ఎలాంటి రీచార్జి చేయకపోయినా వెంటనే డేటాను పొందవచ్చు. దీన్నే ఎమర్జెన్సీ డేటా లోన్‌ గా జియో అందిస్తోంది.

జియో | JIO

ఎమర్జెన్సీ డేటా లోన్‌ ఫీచర్‌ కింద జియో వినియోగదారులు గరిష్టంగా 5 ఎమర్జెన్సీ డేటా లోన్‌ ప్యాక్‌లను పొందవచ్చు. ఒక్కో ప్యాక్‌తో 1 జీబీ డేటాను అందిస్తారు. ఒక్కో ప్యాక్‌కు రూ.11 అవుతుంది. ఇక ఈ డేటాను పొందేందుకు వినియోగదారులు మై జియో యాప్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అందులో ఎడమ వైపు పై భాగంలో ఉండే మెనూను ఎంచుకోవాలి. తరువాత మొబైల్‌ సర్వీసెస్‌ అనే సెక్షన్‌లో ఉండే ఎమర్జెన్సీ డేటా లోన్‌ను ఎంచుకోవాలి. అనంతరం ఎమర్జెన్సీ డేటా లోన్‌ బ్యానర్‌పై ఉండే ప్రొసీడ్‌పై ట్యాప్‌ చేయాలి. తరువాత గెట్‌ ఎమర్జెన్సీ డేటా ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం యాక్టివేట్‌ నౌ పై ట్యాప్‌ చేయాలి. దీంతో ఎమర్జెన్సీ డేటా లోన్‌ లభిస్తుంది.

ఒకసారికి ఒక ప్యాక్ ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. దాంతో 1 జీబీ డేటా వస్తుంది. అది అయిపోగానే ఇంకో ప్యాక్‌ను యాక్టివేట్‌ చేయవచ్చు. ఇలా 5 సార్లు 5 జీబీ డేటా ఎమర్జెన్సీ లోన్‌ కింద లభిస్తుంది. ఒక్కో ప్యాక్‌కు రూ.11 చెల్లించాలి. వినియోగదారులు జియో యాప్‌లోనే ఎమర్జెన్సీ డేటా లోన్‌ అనే పేజీని సందర్శించి అక్కడే తాము వాడుకున్న ప్యాక్‌లకు చెల్లింపులు తరువాత ఎప్పుడైనా చేయవచ్చు. డేటా వెంట వెంటనే అయిపోయే వినియోగదారులు రీచార్జి చేసుకోలేకపోతే ఈ ఫీచర్‌ను ఉపయోగించి అప్పటికప్పుడు డేటాను లోన్‌ కింద తీసుకోవచ్చు.

ఇక ఇలా ఉపయోగించుకునే ఎమర్జెన్సీ డేటా లోన్‌కు గాను రీచార్జి నౌ అండ్‌ పే లేటర్‌ కింద చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే వినియోగదారులు ఏదైనా ప్లాన్‌ను వాడుతుంటేనే ఈ ప్యాక్‌లు లభిస్తాయి. బేస్‌ ప్లాన్‌ వాలిడిటీ ఉన్నన్ని రోజులు ఈ డేటాకు వాలిడిటీ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news