టెలికాం సంస్థ రిలయన్స్ జియోకు చెందిన జియో ఫైబర్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. జియో ఫైబర్‌లో అందుబాటులో ఉన్న అన్ని ప్లాన్లపై డబుల్ డేటాను అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ మేరకు జియో ఫైబర్ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇండ్లలోనే ఉంటున్న తమ కస్టమర్ల కోసం అన్ని ప్లాన్లపై డబుల్ డేటాను అందిస్తున్నట్లు జియో ఫైబర్ తెలియజేసింది.
కాగా జియో ఫైబర్‌లో అన్ని ప్లాన్లతోపాటు డేటా వోచర్లపై కూడా డబుల్ డేటాను అందిస్తున్నట్లు జియో తెలిపింది. అలాగే కొత్తగా జియో ఫైబర్ కనెక్షన్ తీసుకునే వారు ఎలాంటి కనెక్టివిటీ చార్జి చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే కనెక్షన్ పొందవచ్చని జియో తెలిపింది. అయితే కొద్దిపాటి రీఫండబుల్ డిపాజిట్ మాత్రం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక లాక్‌డౌన్ సమయంలోనూ తమ సిబ్బంది నిత్యం 24 గంటలూ పనిచేస్తున్నారని.. దీంతో తమ కస్టమర్లకు అత్యున్నత స్థాయి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయని జియో తెలిపింది.
ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, కోదాడ, మహబూబ్‌నగర్, నల్గొండ ప్రాంతాల్లో జియో ఫైబర్ సేవలు అందుతున్నాయని ఆ సంస్థ తెలియజేసింది. ఈ క్రమంలో వినియోగదారులు 1 జీబీపీఎస్ గరిష్ట స్పీడ్‌తో ఇంటర్నెట్ పొందవచ్చని తెలిపింది. ఇక కొత్త కనెక్షన్ తీసుకునేవారికి నెలకు 100 జీబీ ఉచిత డేటాతో 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్‌ను అందజేస్తున్నామని జియో తెలియజేసింది..!