ఆన్లైన్ క్రికెట్ క్లాసులు పెడుతున్న ధోనీ, అశ్విన్…!

-

కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా ఉండటం తో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీనితో మన దేశంలో క్రికెట్ కార్యాకలాపాలు అనేవి ఏమీ జరగడం లేదు. యువ ఆటగాళ్లకు కోచింగ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అనే చెప్పాలి. దీనితో టీం ఇండియా సీనియర్ ఆటగాళ్ళు… మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సీనియర్ ఎస్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అకాడమీల ద్వారా ఆన్‌లైన్ క్రికెట్ కోచింగ్ కార్యక్రమాలను సులభతరం చేస్తున్నారు.

ఎంఎస్ ధోని తన క్రికెట్ అకాడమీ గత వారం రోజులుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా శిక్షణ పొందే వారికి గాను లైవ్ క్లాసులు అందిస్తున్నాడు. అశ్విన్ అకాడమీ తన క్లాసులను ఆన్‌లైన్ సెషన్లతో సహా పలు మార్గాల్లో అందిస్తుంది. దీనికి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ వస్తుందని తెలుస్తుంది. వారు పోస్ట్ చేసిన ప్రతి వీడియో సెషన్ సోషల్ మీడియా లైవ్ లో పది వేల మందికి పైగా చూస్తున్నారని ధోని అకాడమీ చీఫ్ కోచ్ సత్రజిత్ లాహిరి చెప్పారు.

‘క్రికెటర్’ అనే యాప్‌ను ఉపయోగిస్తున్నారని, అందులో వారు తమ డెమో కసరత్తులు అప్‌లోడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. “శిక్షణ పొందినవారు వారి వీడియోలను కూడా అప్‌లోడ్ చేయాలి, తద్వారా వారి ఆటను మేము గమనించి తదనుగుణంగా అభిప్రాయాన్ని చెప్తామని అన్నారు. ఇతర ఆటగాళ్ళు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news