జియో మ‌రో సంచ‌ల‌నం.. ఉచితంగా హెచ్‌డీ, 4కె టీవీలు..!

-

జియో త్వ‌ర‌లో డీటీహెచ్‌, బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్ లైన్ కంపెనీల‌కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వ‌నుంది. వ‌చ్చే నెల నుంచి జియో గిగాఫైబర్ సేవ‌ల‌ను అధికారికంగా ప్రారంభిస్తున్నామ‌ని ఆ సంస్థ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ వెల్ల‌డించారు.

టెలికాం రంగంలో జియో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. జియో వ‌ల్ల ఇతర టెలికాం కంపెనీల‌కు చావు త‌ప్పి కన్ను లొట్ట‌పోయిన ప‌రిస్థితి ఎదురైంది. దీంతో ఆ కంపెనీలు కూడా దిగి రాక త‌ప్ప‌లేదు. ఇక టెలికాం రంగంలో అన్ని కంపెనీల‌కు షాకిచ్చిన జియో త్వ‌ర‌లో డీటీహెచ్‌, బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్ లైన్ కంపెనీల‌కు కూడా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వ‌నుంది. వ‌చ్చే నెల నుంచి జియో గిగాఫైబర్ సేవ‌ల‌ను అధికారికంగా ప్రారంభిస్తున్నామ‌ని ఆ సంస్థ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ వెల్ల‌డించారు.

గ‌త కొంత సేప‌టి క్రిత‌మే జ‌రిగిన రిల‌య‌న్స్ గ్రూప్ 42వ ఏజీఎం (యాన్యువ‌ల్ జ‌న‌ర‌ల్ మీటింగ్‌)లో ప్ర‌సంగించిన ముఖేష్ అంబానీ జియో గిగాఫైబ‌ర్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. జియో ప్రారంభ‌మై వ‌చ్చే సెప్టెంబ‌ర్ 5వ తేదీకి 3 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతుంది. దీంతో అదే తేదీన జియో గిగాఫైబ‌ర్ సేవ‌లను అధికారికంగా ప్రారంభిస్తామ‌ని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇందులో భాగంగా జియో 4కె హెచ్‌డీ డీటీహెచ్ సెట్ టాప్ బాక్స్‌, ల్యాండ్ లైన్‌, బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల‌ను ఒకే ప్లాన్ కింద అందించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఇక జియో గిగాఫైబ‌ర్ ప్లాన్లు క‌నీసం రూ.700 మొద‌లుకొని గ‌రిష్టంగా రూ.10వేల వ‌ర‌కు ఉంటాయ‌ని తెలిపారు.

కాగా జియో గిగాఫైబ‌ర్ వార్షిక ప్లాన్ల‌ను తీసుకునే క‌స్ట‌మ‌ర్లకు హెచ్‌డీ లేదా 4కె టీవీలు, జియో 4కె సెట్ టాప్ బాక్సుల‌ను ఉచితంగా అందిస్తామ‌ని అంబానీ తెలిపారు. సెట్ టాప్ బాక్సులో ప‌లు యాప్‌ల‌ను కూడా ఉచితంగా అందిస్తామ‌న్నారు. అలాగే జియో గిగాఫైబ‌ర్ ద్వారా అందివ్వ‌నున్న ల్యాండ్ లైన్ సేవ‌ల్లో కేవ‌లం రూ.500 చెల్లిస్తే అన్‌లిమిటెడ్ ఇంట‌ర్నేష‌న‌ల్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంద‌న్నారు. ఇక ఫిక్స్‌డ్ ల్యాండ్‌లైన్స్ ద్వారా చేసుకునే కాల్స్‌కు ఇత‌ర కంపెనీలు వ‌సూలు చేస్తున్న చార్జిల క‌న్నా త‌క్కువగానే తాము చార్జిల‌ను వ‌సూలు చేస్తామ‌న్నారు.

jio gigafiber will be available from september 5th 2019

ప్ర‌స్తుతం అమెరికాలో బ్రాడ్‌బ్యాండ్ ద్వారా స‌గటు వినియోగ‌దారుడికి అందుతున్న నెట్ స్పీడ్ గ‌రిష్టంగా 90 ఎంబీపీఎస్ ఉండ‌గా, జియో గిగాఫైబ‌ర్ ద్వారా క‌నీసం 100 ఎంబీపీఎస్ స్పీడ్ అందుతుంద‌ని, అది గ‌రిష్టంగా 1 జీబీపీఎస్ వ‌ర‌కు ఉంటుందన్నారు. ఇక కార్య‌క్ర‌మంలో భాగంగా ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు జియో 4కె సెట్ టాప్ బాక్స్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

జియో 4కె సెట్ టాప్ బాక్సు ద్వారా 4కె అల్ట్రా హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్ ఉన్న టీవీ ప్ర‌సారాల‌ను వినియోగ‌దారులు వీక్షించ‌వ‌చ్చు. వ‌ర్చువ‌ల్ రియాలిటీ, అగ్‌మెంటెడ్ రియాలిటీల‌ను క‌లిపి మిక్స్‌డ్ రియాలిటీ రూపంలో ప‌లు యాప్స్‌ను అందిస్తున్నారు. అలాగే ఈ సెట్ టాప్ బాక్సు ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎవరికైనా వినియోగ‌దారులు ఉచితంగా వీడియో కాల్స్ చేసుకోవ‌చ్చు. ఇందుకు జియో కాల్ అనే యాప్‌ను అందివ్వ‌నున్నారు. దీంతోపాటు హోం సెక్యూరిటీ, స్మార్ట్ హోం ఫీచ‌ర్ల‌ను కూడా జియో సెట్ టాప్ బాక్సుల్లో పొంద‌వ‌చ్చు. కాగా జియో ప్ర‌క‌టించిన ఈ ఆఫర్ల‌తో ఇత‌ర కంపెనీల్లో వ‌ణుకు మొద‌లైంది. మ‌రి ఆయా కంపెనీలు ఎలాంటి ఆఫ‌ర్ల‌తో ముందుకు వ‌స్తాయో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news