వాణిజ్య అవసరాల కోసం జియో బిజినెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌.. అనేక సేవలు ఒకే ప్లాన్‌లో..

-

టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోకు చెందిన జియో ఫైబర్‌ వ్యాపారాలు చేసుకునేవారితోపాటు కార్యాలయాలకు, వాణిజ్య అవసరాలకు ఉపయోగం అయ్యే విధంగా పలు నూతన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో బిజినెస్‌ టారిఫ్‌ పేరిట జియో ఆ ప్లాన్లను విడుదల చేసింది. ఇందులో బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లతోపాటు డిజిటల్‌ సొల్యూషన్స్‌ను కూడా జియో అందిస్తోంది.

jio launched jio business broadband plans

జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌లో భాగంగా రూ.901, రూ.1201, రూ.2001, రూ.3001, రూ.5001, రూ.7001, రూ.10,001 ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీట్లిలో 100, 150, 300, 500 ఎంబీపీఎస్‌, 1 జీబీపీఎస్‌ ఇంటర్నెట్‌ స్పీడ్స్‌ వినియోగదారులకు లభిస్తాయి. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ లభిస్తాయి. బేసిక్‌ ప్లాన్‌లో 1 లైన్‌ మాత్రమే ఉంటుంది. కానీ ప్లాన్‌ పెరిగేకొద్దీ 2, 4, 8 లైన్ల కనెక్టివిటీని అందిస్తారు. వీటి ద్వారా దేశంలో ఎక్కడికైనా ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఇక ఈ ప్లాన్లతోపాటు ఫిక్స్‌డ్‌ మొబైల్‌ కన్వర్జెన్స్‌ను కూడా కంబైన్డ్‌గా అందిస్తున్నారు. అయితే రూ.5001 ఆపైన ప్లాన్లకు స్టాటిక్‌ ఐపీని ఇస్తారు.

ఇక డిజిటల్‌ సొల్యూషన్స్‌ విషయానికి వస్తే పైన తెలిపిన ప్లాన్లతోబాటు మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ 365ను అందిస్తారు. ప్లాన్‌ మారేకొద్దీ అందించే లైసెన్స్‌ల సంఖ్య పెరుగుతుంది. కనిష్టంగా 2 లైసెన్సులు మొదలుకొని గరిష్టంగా 25 లైసెన్స్‌లు పొందవచ్చు. అలాగే ఉద్యోగుల అటెండెన్స్‌ను మేనేజ్‌ చేసేందుకు జియో అటెండెన్స్‌, మార్కెటింగ్‌ కోసం జియో ఆన్‌లైన్, కాన్ఫరెన్స్‌ కోసం జియో మీట్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, డివైస్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ వంటి సేవలను కూడా ఈ ప్లాన్లతోపాటు అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news