ఆధార్ కార్డు మనకు ఎన్నో అవసరాలకు పనిచేస్తుంది. దాన్ని ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ గా ఉపయోగించుకోవచ్చు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాలకు ఆధార్ అవసరం అవుతుంది. దీంతోపాటు వంట గ్యాస్ సబ్సిడీ పొందేందుకు కూడా ఆధార్ అవసరం. అయితే గ్యాస్ సబ్సిడీ అందని వారు తమ గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్‌తో ఇలా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఏం చేయాలంటే…
వంట గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్‌తో ఆన్‌లైన్‌లో ఇలా అనుసంధానించండి…
స్టెప్ 1: గ్యాస్ వినియోగదారుడు ముందుగా rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeedingpds.aspx అనే సైట్‌ను సందర్శించాలి.
స్టెప్ 2: వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాలను నమోదు చేయాలి.
స్టెప్ 3: అనంతరం ప్రాసెస్ పూర్తయ్యాక వచ్చే ఆప్షన్లలో ఎల్‌పీజీ అనే ఆప్షన్‌ను సెలెక్ఠ్ చేయాలి. తరువాత భారత్ గ్యాస్ అయితే బీపీసీఎల్ అని, ఇండేన్ గ్యాస్ అయితే ఐవోసీఎల్ అనే ఆప్షన్‌లను సెలెక్ట్ చేయాలి. తరువాత కనెక్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: తరువాత వచ్చే పేజీలో డిస్ట్రిబ్యూటర్ పేరు, ఎల్‌పీజీ కన్‌జ్యూమర్ నంబర్‌లను నమోదు చేయాలి.
స్టెప్ 5: తరువాత ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ లను నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 6: ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
స్టెప్ 7: ఓటీపీ వెరిఫై చేసి ప్రక్రియ పూర్తి చేశాక అధికారులు దాన్ని వెరిఫై చేస్తారు. తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నోటిఫికేషన్ వస్తుంది. దీంతో ప్రక్రియ పూర్తయినట్లు భావించాలి.
ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్, ఎల్‌పీజీ కనెక్షన్‌లను లింక్ చేసేందుకు ముందుగా మొబైల్ నంబర్‌ను డిస్ట్రిబ్యూటర్ వద్ద రిజిస్టర్ చేసి ఉండాలి. తరువాత సర్వీస్ ప్రొవైడర్ సూచించినట్లుగా ఎస్ఎంఎస్‌ను పంపించాల్సి ఉంటుంది. దీంతో ఆధార్, గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధానం అవుతుంది.
ఐవీఆర్ఎస్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటే మీరు మీ ఎల్‌పీజీ సర్వీస్ ప్రొవైడర్‌కు చెందిన వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో ఐవీఆర్ఎస్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ నంబర్‌ను తీసుకోవాలి. ఒక్కో జిల్లాకు భిన్నమైన ఐవీఆర్ఎస్ నంబర్లు ఉంటాయి. అందువల్ల మీ జిల్లాకు చెందిన నంబర్‌ను ఆ సైట్‌లో తీసుకోవాలి. తరువాత ఆ నంబర్‌కు కాల్ చేసి అక్కడ అడిగిన వివరాలను తెలపాలి. దీంతో గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డులు అనుసంధానం అవుతాయి. ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.