జియో కొత్త ప్లాన్‌.. రోజుకు 3జీబీ డేటా ఫ్రీ..!

-

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో గత వారం కింద‌ట రూ.2399కు ఏడాది వాలిడిటీ ఉన్న ప్లాన్‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. ఆ ప్లాన్‌లో నిత్యం 2జీబీ డేటా అందిస్తున్నారు. ఇక కొత్త‌గా రూ.999కే మ‌రో ప్లాన్‌ను జియో లాంచ్ చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను వ‌ర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగుల కోస‌మే ప్ర‌త్యేకంగా ప్ర‌వేశ‌పెట్టామ‌ని జియో తెలిపింది.

jio launched rs 999 prepaid plan

రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్లు నిత్యం 3జీబీ ఉచిత డేటా పొంద‌వ‌చ్చు. ఇందులో జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 3వేల నిమిషాల వాయిస్ కాల్స్ వ‌స్తాయి. అలాగే నిత్యం 100 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఇక జియో యాప్స్‌కు కాంప్లిమెంట‌రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా ల‌భిస్తుంది.

రూ.999 ప్లాన్‌కు 84 రోజుల వాలిడిటీని అందిస్తున్నారు. అయితే 28 రోజుల ప్లాన్‌కు రూ.349 అవుతుంది. అందులోనూ నిత్యం 3జీబీ డేటా పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news