కె7 అల్టిమేట్ సెక్యూరిటీ.. మేడిన్ ఇండియా యాంటీ వైర‌స్.. వ‌ర‌ల్డ్ క్లాస్ సేవ‌లు..

-

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏరోజు కారోజు కొత్త వైర‌స్‌లు, స్పైవేర్‌లు, మాల్‌వేర్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. నిత్యం ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక చోట్ల సైబ‌ర్ దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. దీంతో వ్య‌క్తులే కాదు, సంస్థ‌లు కూడా త‌మ డిజిట‌ల్ ప్లాట్‌ఫాంల‌ను ర‌క్షించుకోవ‌డం ఆవ‌శ్య‌కంగా మారింది. అయితే ఎన్నో కంపెనీలు అత్యుత్త‌మ యాంటీ వైర‌స్‌ల‌ను అందిస్తున్న‌ప్ప‌టికీ మేడిన్ ఇండియా యాంటీ వైర‌స్ అయిన కె7 అల్టిమేట్ సెక్యూరిటీ ప్ర‌పంచ స్థాయి కంపెనీల‌తో పోటీ ప‌డుతోంది.

K7 Ultimate Security made in india anti virus giving world class services

డిసెంబ‌ర్ 2020 నాటికి ప్ర‌పంచంలోని టాప్ 10 యాంటీ వైర‌స్‌ల‌లో కె7 అల్టిమేట్ సెక్యూరిటీ స్థానం సంపాదించింది. 1991లో చెన్నైకి చెందిన కేశ‌వ‌ర్ధ‌న‌న్ ఈ కంపెనీని స్థాపించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈ కంపెనీ యూజ‌ర్ల‌కు ప్ర‌పంచ స్థాయి యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ సేవ‌ల‌ను అందిస్తోంది. ఇక ఇత‌ర కంపెనీల‌తో పోలిస్తే ఈ యాంటీ వైర‌స్ ధ‌ర‌లు కూడా త‌క్కువగానే ఉండ‌డం విశేషం.

* ప్రీమియం యాంటీ వైర‌స్ కోసం ఏడాదికి రూ.899 చెల్లిస్తే చాలు.
* బ్రౌజింగ్ ప్రొటెక్ష‌న్, పేరెంట‌ల్ కంట్రోల్స్ కావాలంటే ఏడాదికి రూ.1499 చెల్లించాలి.
* మొబైల్ డివైస్ ప్రొటెక్ష‌న్, డేటా బ్యాక‌ప్ సేవ‌లు కావాలంటే అల్టిమేట్ సెక్యూరిటీ ప్లాన్‌ను రూ.1899 చెల్లించి తీసుకోవ్చు. దీంతో పీసీతోపాటు మొబైల్స్‌కు కూడా ర‌క్ష‌ణ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news