మీ మొబైల్ ఫోన్లో ఈ సెట్టింగ్ మార్చుకుంటే చాలు.. యాప్స్ మీ కంట్రోల్ లోకే..

-

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అనేది మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. అది లేనిది పనే జరగట్లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండగా ప్రపంచం చేతిలో ఉన్నట్టే. ప్రపంచంలో జరిగే ఏ విషయమైనా స్మార్ట్ ఫోన్ తో తెలిసిపోతుంది. ఐతే దీనివల్ల ఇన్ని లాభాలున్నా నష్టాలు కూడా ఉన్నాయి. మన ఫోన్లో ఉండే యాప్స్ వల్ల డేటాకి భంగం కలుగుతుందన్న వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్లో దొరికే ప్రతీ యాప్ ని వేసుకుంటూ పోతే మన ప్రైవసీకే భంగం కలగవచ్చు.

అలా కాకుండా ఉండడానికి ఫోన్లోని కొన్ని సెట్టింగ్స్ ని మార్చుకోవాల్సి ఉంటుంది. డేటా అనేది ప్రస్తుతం పెద్ద అంశంగా మారింది. ఒక యాప్ నుండి తీసుకున్న డేటాని మరో బిజినెస్ కి అమ్ముకోవడం అనేది అలవాటుగా మారిందని అంటున్నారు. చాలా రకాల యాప్స్ ఈ విధంగా చేస్తున్నాయని సర్వేలో వెల్లడైంది. యాప్ వేసుకునేటపుడు మనం ఇచ్చే పర్మిషన్లు ఈ విధమైన చోరీకి దారి తీస్తున్నాయి. ఇదంతా మనకు తెలిసి జరిగేదే. అలా కాకుండా కొన్ని సార్లు యాప్స్ సోర్స్ ఏంటో తెలియదు.

ఎక్కడెక్కడి నుండో అనవసరమైన యాప్స్ వస్తుంటాయి. వాటిని అడ్డుకట్ట వేయడానికి ఫోన్లో ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ డిసేబుల్ చేసుకుంటే అనవసరమైన యాప్స్ మన ఫోన్లోకి వచ్చే వీలుండదు. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అన్ నౌన్ సోర్స్ ఇన్స్టాలేషన్ అన్న ఆప్షన్ దగ్గర డిసేబుల్ చేసుకుంటే, ఎలాంటి సోర్స్ లేని యాప్ లు ఫోన్లోకి రాకుండా ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ సెక్యూరిటీ అంటే మీ సెక్యూరిటీ అన్నట్టే లెక్క. మిమ్మల్ని మీరు సెక్యూర్ గా ఉంచుకోవాలనుకుంటే ఇలాంటి చిన్న చిన్న వాటిని తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news