మైక్రోసాఫ్ట్ సంస్థ ఇండియాలో కొత్తగా సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో లాంచ్ చేసింది. వీటి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇది మొత్తం ఏడు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. అయితే రెండు మాత్రమే ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ఐదు మోడల్‌లు ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మరి అందుబాటులో ఉన్న వాటి ధరలు, ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ వంటి వివరాలను చూసేద్దాం. ల్యాప్‌టాప్ స్టూడియో యొక్క ధరల విషయానికి వస్తే ఇది రూ.1,56,999 నుండి మొదలు అవుతుంది.
11వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i5 SoC:
11వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i5 SoC, 16GB RAM మరియు 256GB స్టోరేజ్ స్పేస్ కలిగి వుంది. ఎంటర్ ప్రెస్సెస్ కి దీని యొక్క ధర రూ.1,56,999 గా వుంది. అదే కస్టమర్‌ల ధర రూ.1,65,999 గా వుంది. ఇది 16GB RAM మరియు 256GB స్టోరేజ్ కలిగి వుంది. ఇది ఇలా ఉంటే ఇంటెల్ కోర్ i5 SoC, 16GB RAM మరియు 512GB స్టోరేజ్ స్పేస్‌తో కూడిన వేరియంట్ ధర రూ.1,74,699 గా వుంది.
ఇంటెల్ కోర్ i5 SoCతో కూడిన మోడల్‌లు ఇంటెల్ ఐరిస్ Xe ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్‌లను కలిగి వున్నాయి. ముందు భాగంలో క్వాడ్ ఓమ్నిసోనిక్ స్పీకర్లు, డ్యూయల్ ఫార్-ఫీల్డ్ స్టూడియో మైక్‌లు మరియు డాల్బీ అట్మోస్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌లతో కూడిన మోడల్‌లు 19 గంటల పాటు పని చేస్తాయి. అలానే ఇది 65W సర్ఫేస్ పవర్ సప్లై అడాప్టర్‌తో ఇది వుంది.
11వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i7 SoC:
ఇంటెల్ కోర్ i7 SoC, 16GB RAM మరియు 512GB స్టోరేజ్ స్పెసిఫికేషన్స్ కలిగిన వేరియంట్ యొక్క ధర ఎంటర్‌ప్రైజెస్ కి రూ.2,01,399 కాగా కస్టమర్‌లకు రూ.2,15,999 ధర వద్ద లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. ఇంటెల్ కోర్ i7 SoC, 32GB RAM మరియు 1TB స్టోరేజ్ స్పేస్ ఉన్న వేరియంట్ ధర రూ.2,54,699.
ఇంటెల్ కోర్ i7 SoC, 32GB RAM మరియు 1TB స్టోరేజ్ స్పేస్‌తో కూడిన వేరియంట్ ధర రూ. 3,07,999. ఇంటెల్ కోర్ i7 SoC, 32GB RAM మరియు 2TB క్వాడ్రో స్టోరేజ్ స్పేస్‌తో కూడిన వేరియంట్ ధర రూ.3,43,499. 32GB RAM మరియు 2TB స్టోరేజ్ స్పేస్‌తో కూడిన వేరియంట్ ధర రూ.2,90,999.
ఈ ల్యాప్‌టాప్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 14.4-అంగుళాల పిక్సెల్‌సెన్స్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను 2,400×1,600 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 10-పాయింట్ మల్టీ-టచ్ తో వుంది. ఇంటెల్ కోర్ i7 SoC Nvidia GeForce RTX 3050 Ti GPUను కలిగి ఉంటాయి. గరిష్టంగా 18 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇది కలిగి ఉంటుంది. 102W సర్ఫేస్ పవర్ సప్లై అడాప్టర్‌తో ఇది వుంది. రెండు USB టైప్-C పోర్ట్‌లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, సర్ఫేస్ కనెక్ట్ పోర్ట్, Wi-Fi 6 మరియు బ్లూటూత్ వెర్షన్ 5.1ని అందిస్తుంది.