‘మేకింగ్ ఆఫ్ జియో ఫోన్ నెక్ట్స్’ ని ఆవిష్కరించిన జియో…!

జియో చేసే వాటి గురించి జియో గురించి మనకి తెలుసు. ప్రతీ భారతీయుడికి డిజిటల్ అనుసంధానతను అందించాలన్న ఆశయాన్ని మరోసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది జియో. జియో ఫోన్ నెక్ట్స్ గురించి మనం ఇప్పుడు పూర్తి వివరాలని చూద్దాం. దీపావళి పండుగ వచ్చేస్తోంది. అందుకని దీపావళి సందర్భంగా ‘మేకింగ్ ఆఫ్ జియో ఫోన్ నెక్ట్స్’ ను జియో విడుదల చేసింది. అలానే జియో ఫోన్ నెక్ట్స్ గురించి, ఆశయం మొదలైన వాటిని ఓ వీడియో ద్వారా తెలిపింది.

జియో ని ఎంతో మంది ఉపయోగిస్తున్నారు. 43 కోట్ల మంది వినియోగదారులతో అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాల్లో, ఆదాయ వర్గాల్లో సేవలిస్తోంది. జియో ఫోన్ నెక్ట్స్ ని ఇండియా లోనే తయారు చేసారు. పైగా మన భారతదేశం కోసం దీనిని తీసుకొచ్చారు. డిజిటల్ సాంకేతికతకు ప్రతీ భారతీయుడు కూడా సమాన అవకాశాలు, సమాన యాక్సెస్ పొందేలా జియో ఫోన్ నెక్ట్స్ చేయడం జరుగుతోంది.

ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలని చూస్తే.. ప్రగతి’ని అందరికీ అందించాలన్న ఆశయంతో జియో, గూగుల్ లోని అత్యుత్తమ నిపుణులతో ఇది రూపుదిద్దుకుంది. ఆండ్రాయిడ్ తో కూడిన ప్రగతి ఓస్ అంతర్జాతీయ స్థాయి ఆపరేటింగ్ సిస్టమ్ దీనిలో వుంది. క్వాల్ కామ్ ప్రాసెసర్ ని దీనిలో ఉపయోగించారు. అలానే ఆడియో, బ్యాటరీలను గరిష్ఠ స్థాయిలో పని చేసేలా చేయడమే కాకుండా లొకేషన్ సాంకేతికతలను కూడా ఇది అందిస్తుంది.

జియో ఫోన్ నెక్ట్స్ లో చెప్పుకోదగ్గ ఫీచర్ల వివరాలు:

వాయిస్ అసిస్టెంట్:

ఈ ఫోన్ లో వాయిస్ అసిస్టెంట్ బాగా హెల్ప్ అవుతుంది. తమకు బాగా తెలిసిన భాషలో ఇంటర్నెట్ నుంచి సులభంగా సమాచారాన్ని పొందడానికి వీలు అవుతుంది.

రీడ్ అలౌడ్ :

కంటెంట్ బయటకు చదివి వినిపించేందుకు ‘లిజన్’ అనేది వినియోగదారులకు బాగా హెల్ప్ అవుతుంది.

ట్రాన్స్ లేట్:

కంటెంట్ ని ట్రాన్స్లేట్ చెయ్యడానికి ఇది ఉపయోగ పడుతుంది. ఇలా వినియోగదారులు తాము ఎంచుకున్న భాషలో కంటెంట్ చదవచ్చు.

స్మార్ట్ కెమెరా:

పోట్రయిడ్ మోడ్ వంటి వివిధ ఫోటోగ్రఫీ మోడ్స్ ని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా బ్లర్డ్ బ్యాక్ గ్రౌండ్ తో ఫోటోలను తీయచ్చు. అలానే లైట్ తక్కువుంటే నైట్ మోడ్ ఫీచర్ ఉంటుంది.
కెమెరా యాప్ కూడా ప్రీలోడెడ్ గా వస్తుంది.

జియో, గూగుల్ యాప్స్:

ఈ ఫోన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని, ఉపయోగించగలిగిన అందుబాటులో ఉన్న అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ ను సపోర్ట్ చేస్తుంది. ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండే లక్షలాది యాప్స్ ను మనం ఇన్స్టాల్ చెయ్యచ్చు. జియో, గూగుల్ యాప్స్ ఇందులో ముందుగానే లోడ్ చేయబడి ఉంటాయి.

ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్:

ఈ ఫోన్ లో ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ తో ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉంటుంది. దీన్ని వినియోగిస్తున్న కొద్దీ, ఆటోమేటిక్ గా అందించబడే అధునాతన ఫీచర్లతో పని తీరు మరెంత బాగుంటుంది. అలానే సెక్యూరిటీ అప్ డేట్స్ కూడా వస్తాయి.

అద్భుతమైన బ్యాటరీ లైఫ్:

బ్యాటరీ లైఫ్ ని అస్సలు చూసుకోక్కర్లేదు. ఆండ్రాయిడ్ తో శక్తివంతమైన, నూతనంగా డిజైన్ చేయబడిన ప్రగతి ఓఎస్ చక్కటి పని తీరుకు, అదే సమయంలో దీర్ఘకాలం ఉండే బ్యాటరీ జీవితానికి వీలు కల్పిస్తుంది. ఇలా ఈ జియో ఫోన్ నెక్ట్స్ తో వినియోగదారులు ఇన్ని లాభాలని పొందొచ్చు. పైగా చాలా ఫీచర్స్ నిజంగా అద్భుతంగా వున్నాయి.