ఇండియాలో రిలీజ్‌ అయిన Samsung Galaxy M04..

-

సాంసంగ్‌ అంటే ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న కంపెనీ.. చాలామంది కొన్ని ఏళ్ల తరబడి అదే కంపెనీ ఫోన్‌ను వాడుతునే ఉన్నారు. సాంసంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ అయింది. సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో సాంసంగ్‌ గెలాక్సీ ఎం04 (Samsung Galaxy M04) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. ఇది పూర్తిగా బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్. ఇందులో ఒక వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సాంసంగ్ గెలాక్సీ ఎం04 ధర..

సాంసంగ్ గెలాక్సీ ఎం04 కేవలం ఒకే వేరియంట్‌లో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499.
బ్యాంకు ఆఫర్స్ ఇంకా వెల్లడించాల్సి ఉంది.
డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో సేల్ ప్రారంభం అవుతుంది. మింట్ గ్రీన్, గోల్డ్, వైట్, బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.

సాంసంగ్ గెలాక్సీ ఎం04 స్పెసిఫికేషన్స్‌, ఫీచర్స్

సాంసంగ్ గెలాక్సీ ఎం04 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది.
మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
బేసిక్ యూసేజ్ కోసం ఈ ప్రాసెసర్ పనితీరు సరిపోతుంది.
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సపోర్ట్ ఉంది.
ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 8జీబీ వరకు ర్యామ్ ఉపయోగించుకోవచ్చు.
మెమొరీ కార్డుతో 128జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
సాంసంగ్ రెండేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తామని ప్రకటించింది.
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఉంది.
4జీ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

కెమెరా క్వాలిటీ..

సాంసంగ్ గెలాక్సీ ఎం04 కెమెరా ఫీచర్స్ చూస్తే 13+2 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉండగా, 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 12 + వన్‌యూఐ 4.1 కోర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news