త్వరలో లాంచ్‌ కానున్న Asus Zenfone 9 స్మార్ట్‌ ఫోన్‌..!

-

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ తన కొత్త స్మార్ట్ ఫోన్ అసుస్ జెన్‌ఫోన్ 9ను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ మధ్యనే ఈ కంపెమీ ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌ 6ను లాంచ్‌ చేసింది. యాపిల్ తరహాలో ప్రతియేటా పరిమిత స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసే కంపెనీ అసుస్ మాత్రమే అని టెక్‌ నిపుణులు అనే మాట.! ఆసుస్‌ బ్రాండ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. చిన్న సైజు ఉన్న పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్స్ లాంచ్ చేస్తూ మిగతా బ్రాండ్ల కంటే భిన్నమైన దారిలో వెళ్తుంది. త్వరలో లాంచ్‌ కాబోయే Asus Zenfone 9కు సంబంధించి ప్రోమో వీడియో కూడా ఆన్‌లైన్‌లో లీక్‌ అయింది.
గతేడాది వచ్చిన జెన్‌ఫోన్ 8 కంటే విభిన్నమైన డిజైన్‌లో జెన్‌ఫోన్ 9 రానుందని సమాచారం.. ఈ స్మార్ట్ ఫోన్ రెడ్, వైట్, బ్లూ, బ్లాక్ రంగుల్లోఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మొదట ఈ వీడియోను టెక్ గోయింగ్ గుర్తించింది.

Asus Zenfone 9 స్పెసిఫికేషన్లు అంచనా..

ఇందులో 5.9 అంగుళాల శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది.
దీంతోపాటు 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉండనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
 ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి.
గింబల్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉండనుంది.
వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ ఉండనుంది.
సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్‌గా ఉంది.
ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.
ఫోన్ వెనకవైపు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
30W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
ఈ నెలలో రిలీజ్‌ అయిన ఆసుస్‌ రోగ్‌ ఫోన్ 6ను గేమింగ్‌ లవర్స్‌ కోసం స్పెషల్‌గా డిజైన్‌ చేశారు. ఈ ఫోన్‌ కూడా గేమింగ్‌ స్పెషలా లేదా అనేది ఇంకా తెలియదు.

Read more RELATED
Recommended to you

Latest news