చైనాలో లాంచ్‌ అయిన Coolpad Cool 20s 5G స్మార్ట్‌ ఫోన్‌..!

-

Coolpad Cool 20s 5G స్మార్ట్‌ ఫోన్‌ రీసింట్‌గా చైనాలో లాంచ్‌ అయింది. కూల్‌ సిరీస్‌లో భాగంగా లాంచ్‌ అయిన కూల్‌ 20, కూల్‌ 20 ప్రో స్మార్ట్‌ ఫోన్లు లాంచ్‌ చేశారు. ఇది ఒక బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌. దీని ధర, ఫీచర్స్‌ ఏమాత్రం ఉన్నాయో చూద్దామా..!

కూల్‌ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ ధర..

కూల్‌ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ ధర చైనాలో 999 యువాన్ల (సుమారు రూ.11,500) నుంచి ప్రారంభం కానుంది.
ఈ ఫోన్‌ సేల్ జూన్ 17 నుంచి జరగనుంది.
4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి.
అజూర్ బ్లూ, ఫైర్‌ఫ్లై బ్లాక్ మూన్, షాడో వైట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.

కెమెరా క్వాలిటీ..

దీనికి వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం.. 48 మెగాపిక్సెల్ సెన్సార్‌ను, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

కూల్‌ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 11 ఆధారిత కూల్ ఓఎస్ 20 ఆపరేటింగ్ సిస్టంపై కూల్‌ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ పనిచేయనుంది.
6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను ఇందులో అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 91.2 శాతంగానూ ఉంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.

బ్యాటరీ సామర్థ్యం..

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
5జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.83 సెంటీమీటర్లుగానూ, బరువు 180 గ్రాములుగానూ ఉంది.
కూల్‌ప్యాడ్ బ్రాండ్‌కు మనదేశంలో పిచ్చ క్రేజ్‌ ఉండేది..ఈ ఫోన్ కూడా ఇండియన్‌ మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టెక్‌ నిపుణులు అంచనా..!

Read more RELATED
Recommended to you

Latest news