బ్రెజిల్‌లో లాంఛ్‌ అయిన Moto G62 5G స్మార్ట్‌ ఫోన్‌.. స్పెసిఫికేషన్లు ఇవే..!

-

మోటో జీ సిరీస్‌లో భాగంగా.. మోటో జీ 62 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను బ్రెజిల్‌లో లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్‌ ఫీచర్స్‌ ఎలా ఉన్నాయో చూద్దామా..!

మోటో జీ62 ధర..

వాస్తవానికి ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.అయితే రూ.17 వేల వరకూ ఉండొచ్చని అంచనా.. కంపెనీ వెబ్‌సైట్లో ఈ ఫోన్ లిస్ట్ అయింది.
గ్రాఫైట్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

మోటో జీ62 స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉండనుంది.
అడ్రెనో 619 జీపీయూ ఉన్న ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు.
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
యాక్సెలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, కంపాస్ సెన్సార్లు ఉన్నాయి.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా… 20W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా… బరువు 184 గ్రాములుగా ఉంది.
120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెట్ కూడా ఉన్నాయి.

కెమెరా విషయానికి వస్తే..

ఈ ఫోన్‌కు వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news