తెలంగాణ లో ఎన్ని లక్షల సీసీ కెమెరాలు,షీటీమ్స్ ఎన్ని ఉన్నా కానీ మహిళలపై ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేవలం ప్రగల్భాలు పలికే అసమర్థత సీఎం కేసీఆర్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్. మహిళా పై జరుగుతున్న హత్యచార కేసులను సిబిఐ తో దర్యాప్తు చేయాలని.. పేరుకు మాత్రమే షి టీమ్స్ పని చేస్తున్నాయన్నారు.
హైదరాబాద్ ప్రతిష్టను మట్టిలో కలిపి హైదరాబాద్ కు ఉన్న గొప్పతనాన్ని చెరిపేసే పద్ధతిలో మైనర్లపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు భయాందోళనలు కలిగిస్తున్నాయని ఆగ్రహించారు.
అత్యాచార అత్యాచారాలు జరిగినా కానీ నిందితులను పట్టుకోవడంలో పోలీస్ వ్యవస్థ విఫలం అయిందన్నారు ఈటల. ప్రజలు నిందితులను పట్టుకుంటే తప్ప పోలీసులు నిందితులను పట్టుకో లేని పరిస్థితిలో ఉన్నారని.. ప్రతిష్ఠాత్మకంగా ఉండే పోలీసు వ్యవస్థ రాజుగారు ఏలుబడిలో నికృష్టంగా దిగజారిపోయారని ఆగ్రహించారు.