Realme Narzo 50A Prime: రూ.10 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్ 

-

Realme Narzo 50A Prime స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయింది. 10వేల లోపు కొనదగ్గ ఫోన్లలో ఇది కూడా ఒకటి. ఇందులో ఫీచర్స్ కూడా బెస్ట్ గా ఉన్నాయి. ఈరోజు మనం దీని ధర, బ్యాటరీ పవర్, కెమెరా క్యాలిటీ అన్నీ చూద్దామా.

రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ ధర

ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 19,99,000 ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.10,600) నిర్ణయించారు.
ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 21,99,000గా ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.11,700) ఉంది.
ఫ్లాష్ బ్లాక్, ఫ్లాష్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ హైలెట్స్
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఆర్ ఎడిషన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
  • ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
  • 1.67 కోట్ల రంగులను ఇది సపోర్ట్ చేయనుంది.
  • 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.
  • స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
  • దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సైడ్ కు అందించారు.
  • ఆక్టాకోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
  • 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు ఒక మోనోక్రోమ్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్  https://amzn.to/3JUhmZL  లింక్ ద్వారా కొన‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news