ఈ నెల 7న ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Realmi 9 4G

-

రియల్‌మీ నుంచి రియల్‌మీ 9 4జీ స్మార్ట్ ఫోన్ ఈ నెల 7 మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ కానుంది. 108 మెగాపిక్సెల్ ప్రో లైట్ కెమెరాతో ఉన్న Realme 9 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే రియల్‌మీ 9ఐ, రియల్‌మీ 9 5జీ, రియల్‌మీ 9 ప్రో+ 5జీ, రియల్‌మీ 9 ప్రో 5జీ, రియల్‌మీ 9 5జీ ఎస్ఈ ఉండగా.. ఇప్పుడు 4జీ మోడల్ జత కానుంది. ఈ ఫోన్ హైలెట్స్ ఏంటో ఈరోజు చూద్దాం.

ఇండియన్ మార్కెట్ లో రియల్‌మీ 9 4జీ అంచనా ధర

రియల్‌మీ 9 4జీ మొబైల్‌ ప్రారంభ ధర భారత్‌లో రూ.15,000గా ఉంటుందని అంచనా.
సన్‌బ్రస్ట్ గోల్డ్, స్టార్‌గేట్ వైట్, మెటోర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం కానుంది.

Realme 9 4G స్పెసిఫికేషన్లు

రియల్‌మీ 9 4జీ వెనుక 108 మెగాపిక్సెల్ ప్రో లైట్ కెమెరా ఉంటుందని రియల్‌మీ వెల్లడించింది. సామ్‌సంగ్‌ ISOCELL HM6 ఇమేజ్ సెన్సార్ ఉంటుందని ప్రకటించింది.
6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ మొబైల్‌ అందుబాటులోకి రానుంది.
వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుందని సమాచారం.
6.6 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఈ మొబైల్‌ వస్తుందని తొలుత సమాచారం రాగా.. అయితే అమోలెడ్ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నట్టు రియల్‌మీ స్పష్టం చేసింది.
దీంతో 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే అమోలెడ్ డిస్‌ప్లేతో రియల్‌మీ 9 4జీ రానుంది.
Realme 9 4G మొబైల్‌లో 5000mAh బ్యాటరీ ఉండనుండగా.. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని లీకులు వచ్చాయి.
స్నాప్‌డ్రాగన్ 4జీ ప్రాసెసర్‌ ఈ మొబైల్‌లో ఉంటుందని సమాచారం.
బడ్జెట్ లో మంచి ఫోన్ తీసుకోవాలనుకునేవారికి.. ఈ ఫోన్ కూడా మంచి ఎంపికే. ఫ్లిప్ కార్ట్ లో ఈ మొబైల్ లిస్ట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news