Anasuya: గ్లామర్ షోలో తగ్గేదేలే..హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న అనసూయ భరద్వాజ్

-

ఇటు బుల్లితెర అటు వెండితెర రెండిటినీ కవర్ చేస్తున్న అనసూయ భరద్వాజ్.. ప్రజెంట్ టాలీవుడ్ లోనే బిజయెస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియాకూ టైం కేటాయిస్తున్నది. తనపై వస్తున్న విమర్శలకు దిమ్మదిరిగిపోయే కౌంటర్స్ ఇస్తూ.. తాను వెరీ స్ట్రాంగ్ ఉమన్ అని నిరూపించుకుంటున్నది.

ఇటీవల ఓ వ్యక్తి ఇద్దరు పిల్లల తల్లి అయి ఉండి పొట్టి బట్టలవసరమా? అని ప్రశ్న అడగగా, సదరు వ్యక్తికి సరిపోయే రిప్లయి ఇచ్చింది. ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు మీరు అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అనసూయ భరద్వాజ్ ప్రధాన ప్రాత్రలో నటిస్తున్న ‘దర్జా’ ఫిల్మ్ టీజర్ ఇటీవల విడుదలైంది. అందులో అనసూయ వెరీ పవర్ ఫుల్ డాన్ గా కనిపిస్తున్నారు.

సునీల్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తుండగా, ఫిల్మ్ పైన అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సంగతులు పక్కనబెడితే.. తాజాగా అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన ఫొటోషూట్, వీడియోలు చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. మలయాళ చిత్ర సీమలోకి ఇటీవల ‘భీష్మపర్వం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ఆ ఫిల్మ్ ప్రతీ ఒక్కరు చూడాలని పేర్కొంటూ..న్యూ డ్రెస్ లో ఫొటోలకు ఫోజులిచ్చిన వీడియో షేర్ చేసింది.

సదరు వీడియోలో అనసూయ చాలా అందంగా కనబడుతోంది. ఎద భాగం వరకే ఉన్న వంకాయ రంగు డ్రెస్సులో అనసూయ చాలా హాట్ గా కనబడుతోంది. ఈ వీడియో చూసి నెటజన్లు ‘సెక్సీ లుక్స్, వావ్.. బ్యూటిఫుల్ భామ, లవ్ యూ’ అని కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ నటించిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈమె ‘రంగమార్తాండ’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news