Samsung A04s కొత్త స్మార్ట్ ఫోన్.. లీకైన స్పెసిఫికేషన్లు ఇవే..!

-

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్..తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ AOSను మనదేశంలో లాంచ్ చేసిన విషయంలో మనకు తెలిసిందే.. తాజాగా.. దీని తర్వాత వర్షన్ గా.. గెలాక్సీ AO4s స్మార్ట్ ఫోన్ కంపెనీ రూపొందిస్తుంది..ఈ ఫోన్ ఫీచర్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి. మరీ లీకులు ఆధారంగా.. స్పెసిపికేషన్లు ఎలా ఉన్నాయో చూద్దామా..!
ప్రముఖ టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్‌స్టోఫర్ తెలిపిన ప్రకారం.. ఈ ఫోన్‌లో ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది.
ఈ సిరీస్ ఫోన్లు రూ.12 వేలలోపు ధరలోనే లాంచ్ అవుతాయి. కాబట్టి దీని ధర కూడా ఈ రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉంటాయి. దాంతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. అయితే కెమెరా బంప్ మాత్రం లేదు.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లను ఫోన్ వెనకవైపు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
కెమెరా సెన్సార్లకు సంబంధించిన సమాచారాన్ని శాంసంగ్ ఇంకా అందించలేదు. వాల్యూమ్ బటన్లు, పవర్ బటన్ ఫోన్‌కు కుడివైపు ఉంటాయి.
కిందవైపు స్పీకర్ అందించారు. దీంతోపాటు యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, మైక్రో ఫోన్ హోల్ కూడా ఉన్నాయి. దీని మందం 0.91 సెంటీమీటర్లుగా ఉండనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03ఎస్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news