ecno Pop 6 Pro: బడ్జెట్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన టెక్నో..!

-

టెక్నో నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌ అయింది. టెక్నో పాప్‌ 6 ప్రో పేరుతో కంపెనీ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఈ ఫోన్‌ మొదటగా బంగ్లాదేశ్‌లో లాంచ్‌ అయింది. బడ్జెట్‌ ఫోన్‌ కొనాలనుకేవారికి ఇది మంచి ఎంపిక. మనదేశంలో లాంచ్ అయిన టెక్నో పాప్ 5 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

టెక్నో పాప్ 6 ప్రో ధర

ఈ ఫోన్ ధరను బంగ్లాదేశ్‌లో 10,490 టాకాలుగా అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.8,900గా నిర్ణయించారు.
పీస్‌ఫుల్ బ్లూ, పోలార్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది. ఇండియాలో ఈ ఫోన్‌ ధర రూ.9 వేలలోపే ఉండే అవకాశం ఉంది.

టెక్నో పాప్ 6 ప్రో స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
ముందువైపు కెమెరా కోసం డాట్ నాచ్ ఉంది. వెనకవైపు డిజైనర్ ప్యానెల్‌ను అందించారు.
ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై టెక్నో పాప్ 6 ప్రో రన్ అవ్వనుంది.
అయితే అది ఏ కంపెనీ ప్రాసెసర్ అన్నది తెలియరాలేదు.
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

ఫీచర్స్..

4జీ, జీపీఎస్, వైఫై, బ్లూటూత్, ఎఫ్ఎం, ఓటీజీ సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు.
గైరో సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్లు ఉన్నాయి.
ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీని మందం 0.87 సెంటీమీటర్లుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news