త్వరలో ఇండియాలో లాంచ్‌ కానున్న Tecno Pova Neo 2..

-

టెక్నో నుంచి కొత్త ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ కానుంది. ఇది ఒక బడ్జెట్‌ ఫోన్‌.. అదే టెక్నో పోవా నియో 2 స్మార్ట్ ఫోన్. త్వరలోనే ఇది ఇండియాలో కూడా లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే ఫోన్‌ ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Tecno Pova Neo 2 స్పెసిఫికేషన్స్..
4 జీబీ, 6 జీబీ ర్యామ్, 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
ఇందులో 6.82 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు.
మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉండనుంది.
దీని ఫీచర్లను బట్టి చూస్తే ధర రూ.12 వేలలోపే ఉండనుంది.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది.
7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో అందించనున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్ సైబర్ బ్లూ, యూరానోలిత్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
టెక్నో ఇటీవలే ఇండియాలో స్పార్క్ 9టీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న దీని ధరను రూ.9,799గా నిర్ణయించారు. టర్కోయిస్ సియాన్, అట్లాంటిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో టెక్నో స్పార్క్ 9టీ అందుబాటులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4జీ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news