చైనాలో లాంచ్‌ అయిన Vivo Y77e T1.. ఫీచర్స్‌ ఇవే..! 

-

వీవో నుంచి కొత్త ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయింది. అదే వీవో వై 77ఈ(టీ1 వెర్షన్‌). దీని ధర కూడా రూ. 20 వేల వరకూ ఉంది. ప్రస్తుతానికి ఒక్క వేరియంట్‌లోనే మాత్రమే లాంచ్ అయిన ఈ ఫోన్‌ వివరాలు ఇలా ఉన్నాయి…
వివో వై77ఈ (టీ1 వెర్షన్) ధర..
ఈ స్మార్ట్ ఫోన్ వివో చైనా వెబ్‌సైట్లో మొదటిసారి కనిపించింది.
దీని ధరను 1,799 యువాన్లుగా అంటే సుమారు రూ.21,000గా నిర్ణయించారు.
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది.
 క్రిస్టల్ బ్లాక్, క్రిస్టల్ పౌడర్, సమ్మర్ లిజెనింగ్ టు ది సీ (బ్లూ షేడ్) రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
వివో వై77ఈ (టీ1 వెర్షన్) స్పెసిఫికేషన్లు..
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి.
వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కెమెరా కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందించారు.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.
వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ ఇటీవలే ఇండియాలో లాంచ్‌ అయింది. ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news