ఫౌ-జి గేమ్ కొత్త ట్రైల‌ర్‌.. గేమ్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించేశారు..

ప‌బ్‌జి ని నిషేధించిన నేప‌థ్యంలో మేడిన్ ఇండియా గేమ్ అయిన ఫౌ-జి ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా.. అని ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. అయితే ఇన్ని రోజుల వారి నిరీక్ష‌ణ‌కు తెర ప‌డిన‌ట్లు అయింది. ఎందుకంటే ఆ గేమ్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్న ఇండియ‌న్ కంపెనీ ఎన్‌కోర్ గేమ్స్ తాజాగా ఫౌ-జి గేమ్‌కు చెందిన మ‌రో ట్రైల‌ర్‌ను లాంచ్ చేసింది. అలాగే గేమ్‌ను ఎప్పుడు విడుద‌ల చేసేదీ ప్ర‌క‌టించింది.

ncore games announced release date of fau-g game

ఫౌ-జి గేమ్‌ను రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు ఎన్‌కోర్ గేమ్స్ ప్ర‌క‌టించింది. కాగా ప‌బ్‌జిలా కాకుండా ఫౌ-జి గేమ్‌లో ప్లేయ‌ర్లు ఎపిసోడ్స్ లేదా మిషన్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా విడుద‌లైన గేమ్ ట్రైల‌ర్ గేమింగ్ ప్రియుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

అయితే గేమ్ విడుద‌ల‌య్యాక మొద‌టి ఎపిసోడ్ గాల్విన్ వ్యాలీ నేప‌థ్యంలో ఉంటుంద‌ని మ‌న‌కు ట్రైల‌ర్‌ను చూస్తే తెలుస్తుంది. అలాగే ట్రైలర్‌లో కొంద‌రు పంజాబీలో మాట్లాడుకుంటూ క‌నిపిస్తారు. కానీ గేమ్‌ను ఏయే భాషల్లో అందిస్తార‌న్న‌ది తెలియ‌లేదు. ఇక ద‌స‌రా రోజున ఫౌ-జి గేమ్ ను ప్ర‌క‌టించ‌గా న‌వంబ‌ర్ లోనే ఈ గేమ్‌ను లాంచ్ చేస్తార‌ని భావించారు. కానీ ఎట్ట‌కేల‌కు గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్బంగా గేమ్‌ను జ‌న‌వ‌రి 26న లాంచ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో గేమ్ విడుద‌ల తేదీ కోసం గేమింగ్ ప్రియులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.