డెబిట్‌, క్రెడిట్‌ కార్డులకు ఇక‌నుంచీ కొత్త స‌దుపాయం..

-

డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వినియోగదారులు తమ కార్డును స్విచ్‌ ఆన్‌, స్విచ్‌ ఆఫ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాలని బ్యాంకులు, ఇతర సంస్థలను ఆర్‌బీఐ కోరింది. గడిచిన కొన్నేళ్లలో కార్డు ద్వారా లావాదేవీలు, వాటి విలువ పలు రెట్లు పెరిగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు కార్డుల్లో ఈ సరికొత్త ఫ్యూచర్లను బ్యాంకులు అందుబాటులోకి తెస్తున్నాయి. డిజిటల్‌ లావాదేవీలకు మరింత రక్షణ కల్పించేందుకు కార్డులో ఆన్‌ ఆఫ్‌ సదుపాయం, ప్రజెంట్‌, నాట్‌ ప్రెజెంట్‌ ముఖ్యమైనవి. కార్డుదారుడు తనకు అవసరం లేదనుకున్నప్పుడు, అనుమానం కలిగినప్పుడు తన క్రెడిట్‌, డెబిట్‌ కార్డును ఆఫ్‌ చేసుకోవచ్చు. దీనివల్ల సైబర్‌ నేరగాళ్లు లేదా చోరులకు కార్డు వివరాలు చిక్కినా లావాదేవీలు నిర్వహించుకోలేరు. ముఖ్యంగా కార్డు యజమాని తనకు అవసరమైనప్పుడు మాత్రమే కార్డు, అందులోని ఆప్షన్లు పనిచేసేలా చూసుకోవచ్చు.

కార్డ్‌ నాట్‌ ప్రజెంట్‌ ఆప్షన్‌ ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించినది. లావాదేవీల స్విచ్‌ ఆన్‌/ఆఫ్‌ వెసులుబాటుతోపాటు లావాదేవీ పరిమితి నిర్దేశం లేదా సవరణకు అవకాశం కల్పించడం. ఈ ఆప్షన్‌ ఎంచుకునే వారికి అన్ని రకాల (దేశీయ, అంతర్జాతీయ, పీఓఎస్‌, ఏటీఎం, ఆన్‌లైన్‌, కాంటాక్ట్‌లెస్‌) లావాదేవీలను అన్ని మార్గాల్లో (మొబైల్‌ యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం, ఐవీఆర్‌) వారంలో 24 గంటలపాటు అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే జారీ చేసిన కార్డుల విషయంలో వినియోగదారుల రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా తమకు తగిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌(కార్డ్‌ నాట్‌ ప్రజెంట్‌)/అంతర్జాతీయ/కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలకు ఉపయోగించని కార్డులో ఈ ఆప్షన్లను తప్పనిసరిగా డీయాక్టివేట్‌ చేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news