పవన్ ఉంటే చంద్రబాబుతో పనేంటి…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయం మారిపోయింది. పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన బిజెపితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని ముందుకి వెళ్ళారు. రాజకీయంగా రాష్ట్రంలో ఏ విధంగా చూసుకున్నా అవకాశాలు లేని భారతీయ జనతా పార్టీతో పవన్ పొత్తు పెట్టుకోవడం చూసి జనసేన కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయారు. పోనీ తెలుగుదేశంతో పెట్టుకున్నా ఒకరకంగా ఉండేది గాని,

అసలు అవకాశం లేని బిజెపితో పెట్టుకుని ఆయన ఎం సాధిస్తారు అనే ప్రశ్న ఎక్కువగా వినపడుతుంది. అయితే ఇక్కడ బిజెపి వ్యూహం ఏంటీ అనేది ఒకసారి చూస్తే, పవన్ బిజెపితో కలిసారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను స్వయంగా పూర్తి చేయడానికి పవన్ చొరవ చూపించవచ్చు. తద్వారా భారతీయ జనతా పార్టీకి బలం పెరుగుతుంది. ఇప్పుడు రాజధాని మార్పు విషయంలో పవన్ సక్సెస్ అయితే,

జనసేన, బిజెపి కలిసి రంగ౦లోకి దిగితే వైసీపీ ఇరుకున పడే అవకాశం ఉంది, రాజధాని తరలింపు విషయంలో రాష్ట్ర ప్రజల్లో పెద్ద సానుకూలత అనేది లేదు. కాబట్టి బిజెపి జనసేనకు సెంట్రల్ ఆంధ్రాలో బలం పెరిగే అవకాశం ఉంది. ఆరు జిల్లాల్లో రాజధాని తరలింపు విషయంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక అమరావతిలో పనులు చేయడానికి కేంద్రం ముందుకి వస్తే ఇంకా బలం పెరుగుతుంది.

అప్పుడు జగన్ దూకుడుకి అడ్డుకట్ట వేసే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు వైసీపీ నేతల భయం కూడా దాదాపుగా అదే. ఇక బిజెపికి చంద్రబాబుతో పెద్దగా అవసరం లేదనే విషయం అర్ధమవుతుంది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే పవన్ ఫాలోయింగ్ తో అధికారంలోకి రాకపోయినా ప్రభావం చూపించడం, క్రమంగా బలపడటం వంటివి చేయవచ్చు. అప్పుడు చంద్రబాబుతో పెద్దగా బిజెపి అవసరం ఉండదు. వైసీపీతో ఎలాగూ స్నేహం చేయదు బిజెపి. కాబట్టి చంద్రబాబుకి బిజెపితో స్నేహం విషయంలో దారులు మూసుకుపోయినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news