నోకియా 6.2పై రూ.10వేల ఎక్స్చేంజ్‌ ఆఫర్‌

-

ప్ర‌ముఖ ఫోన్ కంపెనీ నోకియా తమ సంస్థ నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ నోకియా 6.2 పేరిట భారత మార్కెట్లలో శుక్రవారం విడుదలైంది. గత నెలలో బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్‌ఎ టెక్ ఫెయిర్‌లో మొదట హెచ్‌ఎండి గ్లోబల్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. 4జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 15,999. అమెజాన్‌లో నోకియా 6.2 (సిరామిక్ బ్లాక్ వెర్షన్ ) అమ్మకాలు మొదలయ్యాయి. మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో నోకియా 6.2 పేరుతో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. 6.3 అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లే, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 16+ 5 + 8 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అలాగే 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌, 512 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం, హెచ్‌డిఆర్ 10 సపోర్ట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ లాంటివి ఉన్నాయి. ఆఫర్ల విషయానికి వస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 2,000 రూపాయలు క్యాష్‌బ్యాక్‌. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే 10,100 వరకు ఆఫర్‌ను అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news