బ్రేకింగ్‌: కోహ్లీ సెంచ‌రీ… పుణే టెస్టుల్లో రికార్డుల వేట‌

-

దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి(104 బ్యాటింగ్‌; 183 బంతుల్లో16 ఫోర్లు) అరుదైన రికార్డ్‌ల్లో చోటు దక్కించుకున్నాడు. . కోహ్లికి తోడు అజింక్యా రహానే (58 బ్యాటింగ్‌; 161 బంతుల్లో 8ఫోర్లు) అర్దసెంచరీతో రాణిచండంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. 273/3 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లి, రహానేలు నిలకడగా ఆడుతున్నారు.

అయితే పుణె టెస్టులో శతకం ద్వారా టెస్టు కెరీర్‌లో 26వ శతకం మార్క్‌ని అందుకున్న విరాట్ కోహ్లీ.. సొంతగడ్డపై ఎట్టకేలకి దక్షిణాఫ్రికాపై తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇక కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 19వ టెస్టు శతకంకాగా.. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ సరసన కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగులు(145) చేసిన జోడిగా ద్రవిడ్‌-గంగూలీ పేరిట ఉన్న రికార్డును తాజాగా కోహ్లి-రహానేలు బ్రేక్‌ చేశారు. ప్రస్తుతం లంచ్‌ విరామం వరకు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news