ముల్తానీతో శిరోజాలకు మేలు!

-

ముల్తానీమట్టి అంటే వెంటనే ఫేస్‌ప్యాక్‌ గుర్తొస్తుంది. వారానికి మూడుసార్లు ముల్తానీ వాడడం వల్ల ముఖసౌదర్యం పెరుగుతుంది. అలాంటి ముల్తానీ జుట్టుకు కూడా మేలు చేస్తుందంటే నమ్ముతారా? దీంతో జట్టుకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. ముల్తానీతో ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం.

ముల్తానీమట్టిని కేవలం ముఖ సౌందర్యానికే పరిమితం చేయనక్కర్లేదు. దీనివల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. దీన్ని కొన్ని పదార్థాలతో కలుపుకొని పూతలా వేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.

– జుడ్డు జిడ్డుగా మారి అంటుకున్నట్లుగా ఉంటే.. ముల్తానీమట్టిలో గుడ్డులోని తెల్లసొనను వేరుచేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. గంటపాటు అలానే ఉంచాలి. తలస్నానం చేయడానికి బకెట్‌లో నింపుకున్న నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుంటే గుడ్డు వాసన రాకుండా ఉంటుంది. గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఎక్కువరోజులు జిడ్డుగా మారకుండా ఉంటుంది.

– ముల్తానీమట్టిలో కొంచెం పెరుగు, నువ్వులనూనె వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 60 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పెరుగుతుంది.

– కొంతమందికి తలస్నానం చేసిన రెండురోజులకే జుట్టుగా మారిపోతుంది. అలాంటివారు ముల్తానీమట్టిలో నీళ్లు కలుపుకొని తలకు రాసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే దీన్ని తరుచుగా మాత్రం చేయకూడదు. ఎక్కువగా మాడులో సహజంగా ఉండే నూనెలు విడుదలవ్వవు.

– చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొన్ని మెంతులను రాత్రంతా నానబెట్టి ముద్దలా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కాస్త ముల్తానీమట్టిని కలుపుకొని తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు నుంచి విముక్తి చెందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news