నోకియా నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

త‌క్కువ ధ‌ర‌ల‌కే ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ల‌ను త‌యారు చేసి అందివ్వ‌డంలో నోకియా పేరుగాంచింది. హెచ్ఎండీ గ్లోబ‌ల్ టేకోవ‌ర్ చేసిన‌ప్ప‌టి నుంచి అనేక నోకియా స్మార్ట్ ఫోన్‌ల‌ను విడుద‌ల చేసింది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో రెండు నోకియా ఫోన్ల‌ను విడుద‌ల చేశారు. ఇవి బ‌డ్జెట్ ధ‌ర‌ల‌లో ల‌భిస్తుండ‌డం విశేషం. ఇక వీటిల్లో ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి.

nokia launched two new smart phones with budget prices

నోకియా జి10 స్మార్ట్ ఫోన్‌లో.. 6.52 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11, 13, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, గూగుల్ అసిస్టెంట్ బ‌ట‌న్‌, డ్యుయ‌ల్ 4జివీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5050 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్లు ఉన్నాయి.

నోకియా సి01 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌లో.. 5.45 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెస‌ర్‌, 2జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిష‌న్‌, డ్యుయ‌ల్ సిమ్, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఉన్నాయి.

నోకియా జి10 ఫోన్ ధ‌ర రూ.12,149 ఉండ‌గా దీన్ని నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో విక్ర‌యిస్తున్నారు. జియో క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.999 డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఇక నోకియా సి01 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.5,999గా ఉంది. దీన్ని అన్ని ఆఫ్‌లైన్, ఆన్ లైన్ స్టోర్‌ల‌లో విక్ర‌యిస్తున్నారు. జియో క‌స్ట‌మ‌ర్లు ఈ ఫోన్‌పై 10 శాతం త‌గ్గింపు ధ‌ర‌ను పొంద‌వ‌చ్చు.