ఆండ్రాయిడ్ వాట్సాప్ యాప్‌లో కొత్త ఫీచ‌ర్‌.. ఫింగ‌ర్ ప్రింట్‌ లాక్ పెట్టుకోవ‌చ్చు..!

-

వాట్సాప్‌ను వాడుతున్న ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఇక‌పై ఆ యాప్‌కు ఫింగ‌ర్ ప్రింట్ లాక్ పెట్టుకోవ‌చ్చు. అందుకుగాను వారు వాట్సాప్‌ను ముందుగా కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేసుకోవాలి.

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వినియోగదారుల‌కు నూత‌న ఫీచ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తుంద‌న్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ యాప్‌లో ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగ‌దారులకు ఓ నూత‌న ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. వాట్సాప్‌ను ఐఫోన్ల‌లో వాడే వారికి ఇప్ప‌టికే ఫింగ‌ర్ ప్రింట్ లాక్ ఫీచ‌ర్ అందుబాటులో ఉండ‌గా, ఇక‌పై దీన్ని ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజ‌ర్లు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.

now you can set finger print lock for whatsapp in android

వాట్సాప్‌ను వాడుతున్న ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఇక‌పై ఆ యాప్‌కు ఫింగ‌ర్ ప్రింట్ లాక్ పెట్టుకోవ‌చ్చు. అందుకుగాను వారు వాట్సాప్‌ను ముందుగా కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. ఆ త‌రువాత యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌లోని అకౌంట్స్ విభాగంలో ఉండే ప్రైవసీ సెక్ష‌న్‌లోకి వెళ్తే అక్క‌డ వారికి ఫింగ‌ర్ ప్రింట్ లాక్ అన్న ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే చాలు.. ఇక‌పై యూజ‌ర్లు ఎప్పుడు వాట్సాప్‌ను ఓపెన్ చేసినా క‌చ్చితంగా ఫింగ‌ర్ ప్రింట్‌తోనే ఆ యాప్‌ను అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే వాట్సాప్ యాప్‌కు ఎంత స‌మ‌యం త‌రువాత ఆటోమేటిక్ లాక్ ప‌డాలో కూడా అక్క‌డే కింద ఉంటుంది. అందులో ఇమ్మిడియ‌ట్లీ, 1 మిన‌ట్‌, 30 మిన‌ట్స్ త‌దిత‌ర ఆప్ష‌న్లు ఉంటాయి. వాటిలో యూజ‌ర్ ఎంచుకున్న ప్ర‌కారం ఆ స‌మ‌యం అయ్యాక వాట్సాప్ యాప్‌కు ఆటోమేటిక్‌గా లాక్ ప‌డుతుంది.

అయితే వాట్సాప్ యాప్‌కు ఫింగ‌ర్ ప్రింట్ లాక్ పెట్టుకున్నా స‌రే… నోటిఫికేష‌న్ల‌ను చూసి నేరుగా వాటి నుంచే రిప్ల‌యి ఇచ్చే ఫీచ‌ర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కాగా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లోనే ఐఓఎస్ యూజ‌ర్లకు వాట్సాప్‌లో ఫింగ‌ర్ ప్రింట్ లాక్‌, ఫేస్ ఐడీ లాక్ అందుబాటులోకి రాగా, ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాట్సాప్‌ను వాడుత‌న్న వారికి ఫింగ‌ర్ ప్రింట్ లాక్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది..!

Read more RELATED
Recommended to you

Latest news