లాంచ్‌కు ముందే లీకైన OnePlus 11 వివరాలు..!! ఫీచర్స్‌ కేక..!!

-

OnePlus 11 మొబైల్ 5G టెక్నాలజీతో వస్తోంది. ఈ అడ్వాన్స్డ్‌ మోడల్ మొబైల్‌లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీని వినియోగించారు. ఈ ఫోన్‌ గురించి ఆన్‌లైన్‌లో ఇప్పటికే చాలా సమాచారం తెలిసింది.. మరి ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ ఎలా ఉన్నాయో చూద్దామా..!
OnePlus 11 details: పూర్తి AI ఇంటిగ్రేషన్
OnePlus 11 5G మొబైల్‌ను 8 Gen 2 processor సహకారంతో పూర్తిగా కృత్రిమ మేథ(AI) టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేశారు. అలాగే, AI ఇంజిన్‌తో క్వాల్ కామ్ హెగ్జాగాన్ ప్రాసెసర్‌ను అనుసంధానించారు. దాని వల్ల అత్యంత వేగవంతమైన ప్రాసెసింగ్ సాధ్యమవుతుంది. ఈ క్వాల్ కామ్ చిప్ సెట్ ప్రస్తుతం వన్ ప్లస్ మొబైల్స్‌తో వాడుతున్న చిప్ సెట్ ల కన్నా 40% మరింత శక్తిమంతంగా పని చేస్తుంది. అడ్రెనో జీపీయూ(Adreno GPU) , క్రయో సీపీయూ(Kryo CPU)లతో గేమింగ్ పర్ఫార్మెన్స్ లో ఇది తిరుగు లేని పని తీరును కనబరుస్తుంది.
వన్ ప్లస్ నుంచి వస్తున్న ఈ వన్ ప్లస్ 11 మొబైల్లో 6.7 అంగుళాల QHD+ AMOLED స్క్రీన్‌ను అమర్చారు.
దీని రిఫ్రెష్ రేటు 120 హెర్జ్.
పై భాగంలోని పంచ్ హోల్ కెమెరా కట్(punch-hole camera cut) మొబైల్‌కు స్టైలిష్ లుక్ తీసుకువచ్చింది.
ఈ ఫోన్‌లో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్ లో 48 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2*32 ఎంపీ టెలీఫొటో లెన్స్ లతో 50 ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను అమర్చారు.
ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.
ఇందులో 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.
ఇందులో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని పొందుపర్చారు.
ఈ ఫోన్ కు 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది.
కనెక్టివిటీ కోసం వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, టైప్ సీ యూఎస్ బీ ఉన్నాయి.
వచ్చే సంవత్సరం జూన్ లోపు ఈ ఫోన్ ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news