రివైండ్ 2024 : ఇన్స్‌టాగ్రాం, వాట్సాప్ కాకుండా ఎక్కువ మంది యూజ్ చేసే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్

-

సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అనగానే అందరి మనసులోకి వచ్చే పేర్లలో ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ వంటివి ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా జనాలు అందరూ వీటి మీదే ఆధారపడతారా అంటే కాదు అని చెప్పవచ్చు.

ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ కాకుండా యూజర్లు వాడే మిగతా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.

వీ చాట్:

దీని గురించి ఎక్కువమందికి తెలియకపోవచ్చు. కానీ చైనాలో ఇది చాలా ఫేమస్. మనకు వాట్సాప్ ఎలాగో చైనా వాళ్లకు వి చాట్ అలాగా. దీని ద్వారా టెక్స్ట్ మెసేజెస్ పంపించుకోవచ్చు. వాయిస్ రికార్డింగ్స్ సెండ్ చేసుకోవచ్చు. వీడియో కాల్స్ ఆడియో కాల్స్ కూడా.

ఒక నెలలో 1343 మిలియన్ల మంది వీ చాట్ అప్లికేషన్ ని వాడుతున్నారు.

టిక్ టాక్:

గతంలో ఇండియాలో కూడా ఇది అందుబాటులో ఉండేది. ప్రస్తుతం దీన్ని నిషేధించారు. అయితే ఇతర దేశాల్లో దీన్ని వాడే వారి సంఖ్య పెద్ద మొత్తంలోనే ఉంది. ఒక నెలలో 1582 మిలియన్ల మంది టిక్ టాక్ వాడుతున్నారు.

టెలిగ్రామ్:

ఇండియాలో కూడా అందుబాటులో ఉన్న ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ని దాదాపు ఒక నెలలో 900 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్ ల జాబితాలో ముందు వరుసలో ఫేస్ బుక్ ఉంటుంది. ఆ తర్వాత.. యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version