రియ‌ల్‌మి నుంచి నార్జో సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు.. ఫీచ‌ర్లు అదిరాయ్‌..!

-

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి నార్జో సిరీస్‌లో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. నార్జో 30ఎ, నార్జో 30 ప్రొ 5జి పేరిట ఆ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. వీటిల్లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

realme Narzo 30A narzo 30 Pro 5G smart phones launched

రియ‌ల్‌మి నార్జో 30ఎ ఫీచ‌ర్లు…

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి85 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* 13, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి నార్జో 30ఎ స్మార్ట్ ఫోన్ కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.8,999 ఉండ‌గా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 5వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు.

రియ‌ల్ మి నార్జో 30 ప్రొ 5జి ఫీచ‌ర్లు…

* 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్
* 64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* 48, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డాల్బీ అట్మోస్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

నార్జో 30 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.16,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధ‌ర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 4వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news