అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో రియ‌ల్‌మి స్మార్ట్‌వాచ్‌.. ధ‌ర కేవ‌లం రూ.3,999 మాత్ర‌మే..!

-

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. వాచ్ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌వాచ్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 1.4 ఇంచుల ట‌చ్ క‌ల‌ర్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. 12 ర‌కాల బిల్టిన్ వాచ్ ఫేసెస్‌ను ఇందులో అందిస్తున్నారు. అలాగే రియ‌ల్‌మి లింక్ యాప్ తో మ‌రో 100 ర‌కాల కొత్త వాచ్ ఫేసెస్‌ను ఈ వాచ్‌లో సెట్ చేసుకోవ‌చ్చు. ఇందులో 24 అవ‌ర్ హార్ట్ రేట్ మానిట‌రింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అలాగే బ్ల‌డ్ ఆక్సిజ‌న్ లెవ‌ల్‌ను కొలిచే మీట‌ర్‌ను కూడా అందిస్తున్నారు.

Realme Watch launched in india for only rs 3,999

రియ‌ల్‌మి వాచ్‌లో 14 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. దీంతో యూజ‌ర్ వాకింగ్ లేదా ర‌న్నింగ్ ఏది చేసినా వాచ్ ఆటోమేటిగ్గా గుర్తిస్తుంది. అలాగే ఈ వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు క‌నెక్ట్ చేసుకుంటే దానికి వ‌చ్చే కాల్స్‌, ఎస్ఎంఎస్‌, ఇత‌ర యాప్‌ల‌కు చెందిన నోటిఫికేష‌న్ల‌ను కూడా వాచ్‌పై చెక్ చేసుకోవ‌చ్చు. అలాగే ఫోన్‌లో మ్యూజిక్ ప్లేయ‌ర్‌ను వాచ్ స‌హాయంతో కంట్రోల్ చేయ‌వ‌చ్చు. ఫోన్‌లో ఉండే కెమెరాను కూడా వాచ్ స‌హాయంతో ఆప‌రేట్ చేసుకోవ‌చ్చు. ఈ వాచ్‌కు ఐపీ 68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అలాగే 160 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల వాచ్ 9 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తుంది.

రియ‌ల్‌మి వాచ్ స్పెసిఫికేష‌న్లు…

* 1.4 ఇంచ్ ట‌చ్ క‌ల‌ర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 320×320 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, రోటార్ వైబ్రేష‌న్ మోటార్
* బ్లూటూత్ 5.0, ఆండ్రాయిడ్ క‌నెక్టివిటీ
* 14 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌, ఆటోమేటెడ్ హార్ట్ రేట్ మీజ‌ర్‌మెంట్
* 24 అవ‌ర్ రియ‌ల్‌టైం హార్ట్ రేట్‌, బ్ల‌డ్ ఆక్సిజ‌న్ (ఎస్‌పీఓ2) మీజ‌ర్‌మెంట్
* స్లీప్ డిటెక్ష‌న్‌, స్టెప్స్‌, క్యాల‌రీస్‌, డిస్టాన్స్ ట్రాక‌ర్
* వాట‌ర్ రిమైండ‌ర్‌, సెడెంట‌రీ రిమైండ‌ర్‌, యాక్టివిటీ రికార్డ్స్
* మ్యూజిక్ కంట్రోల్‌, కెమెరా కంట్రోల్‌, వెద‌ర్ ఫోర్‌క్యాస్ట్
* ఆటోమేటిక్ మోష‌న్ రిక‌గ్నిష‌న్
* కాల్ నోటిఫికేష‌న్‌, మెసేజ్ రిమైండ‌ర్‌, అలారం రిమైండ‌ర్
* ఐపీ 68 వాట‌ర్ రెసిస్టెన్స్‌, 160 ఎంఏహెచ్ బ్యాట‌రీ

రియ‌ల్‌మి వాచ్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో విడుద‌లైంది. దీనికి ప‌లు ర‌కాల రంగుల‌తో కూడిన స్ట్రాప్స్ వ‌స్తాయి. రూ.3,999 ధ‌ర‌కు ఈ వాచ్‌ను ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో జూన్ 5వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news