జియో గిగా ఫైబ‌ర్ వ‌చ్చేసింది… ప్లాన్లు ఇవే

-

వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్ట‌కేల‌కు గురువారం ప్రారంభ‌మ‌య్యాయి. ముందుగా అనుకున్న‌ట్టుగానే సెప్టెంబ‌ర్ 5వ తేదీ నుంచి ఈ సేవ‌లు ప్రారంభ‌మవుతాయి. ఇక గిగా ఫైబ‌ర్ ప్లాన్లు కూడా ఈ రోజు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం జియో గిగాఫైబర్‌లో 6 ప్రీపెయడ్ ప్లాన్లను అందుబాటులో ఉంచారు. బ్రాంజ్ కేటగిరిలో నెలకు రూ.699కు, సిల్వర్ విభాగంలో నెలకు రూ.849కు, గోల్డ్‌లో రూ.1299కు, డైమండ్ విభాగంలో నెలకు రూ.2499కు, ప్లాటినంలో రూ.3999కు, టైటానియం విభాగంలో నెలకు రూ.8499కు మొత్తం 6 ప్లాన్లను అందిస్తున్నారు.


– ఈ ప్లాన్ల‌లో నెట్ డీటైల్స్ చూస్తే బ్రాంజ్, సిల్వర్ ప్లాన్లలో 100 ఎంబీపీఎస్ గరిష్ట ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది.

–  గోల్డ్, డైమండ్‌లలో 250, 500 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది.

– ప్లాటినం, టైటానియం ప్లాన్లలో గరిష్టంగా 1జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది.

– వీటితోపాటు 3, 6, 12 నెలల వాలిడిటీ ఉన్న ప్లాన్లు కూడా ఉంటాయి.

– బ్రాంజ్ ప్లాన్‌లో కస్టమర్లకు నెలకు 100జీబీ ఉచిత డేటా లభిస్తుంది. దీంతోపాటు లాంచింగ్ సందర్భంగా మరో 50 జీబీ డేటాను అదనంగా అందిస్తున్నారు.

– సిల్వర్ ప్లాన్‌లో 200 జీబీ నెలవారీ డేటా, 200 జీబీ అదనపు డేటా ఉంటుంది.

– గోల్డ్ ప్లాన్‌లో 500 జీబీ+250 జీబీ డేటా, డైమండ్ ప్లాన్‌లో 1250 జీబీ + 250 జీబీ డేటా ఉంటుంది.

– ప్లాటినం ప్లాన్‌లో 2500 జీబీ డేటా ల‌భిస్తుంది.

– టైటానియం ప్లాన్‌లో 5000 జీబీ నెలవారీ డేటా లభిస్తుంది. ఇక ఈ ప్లాన్లు అన్నింటిలోనూ ఇచ్చే డేటా అంతా అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. 30 రోజులు కాగానే బిల్ సైకిల్ మారి, స్పీడ్, డేటాలు యథావిధిగా లభిస్తాయి.

– దేశంలో ఎక్క‌డికైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు.

– అన్ని ప్లాన్లలోనూ ఏడాదికి రూ.1200 విలువ గల ఉచిత టీవీ వీడియో కాలింగ్‌ను, మరో రూ.1200 విలువైన గేమింగ్ సదుపాయాన్ని, హోం నెట్‌వర్కింగ్, డివైస్ సెక్యూరిటీ (5 డివైస్‌లకు) సదుపాయాలను అందిస్తున్నారు.

–  డైమండ్, ప్లాటినం, టైటానియం ప్లాన్లలో అదనంగా వీఆర్ ఎక్స్‌పీరియెన్స్, ప్రీమియం కంటెంట్ (ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీలు, స్పెషల్ స్పోర్ట్స్ కంటెంట్)ను అందిస్తున్నారు.

– జియో గిగాఫైబర్ సేవలకు గాను వార్షిక ప్లాన్‌ను ఒకేసారి తీసుకునే వారికి వెల్కం ఆఫర్ కింద రూ.5వేల విలువైన జియో హోం గేట్‌వే, రూ.6400 విలువైన జియో 4కె సెట్ టాప్ బాక్స్‌లను ఉచితంగా అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news