శాంసంగ్ సరికొత్త క్యూడి ఓ‌ఎల్‌ఈ‌డి టీవీ.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మొదలైన వివరాలివే..!

-

మీరు మంచి స్మార్ట్ టీవీని కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తీసుకొచ్చిన ఈ స్మార్ట్ టీవీ గురించి చూడండి. శాంసంగ్ QD-OLED TV ని అదిరే ఫీచర్స్ తో తీసుకు వచ్చింది. మరి ఇక ఈ టీవీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వంటి వివరాలను చూస్తే.. ఈ టీవీ ని కంపెనీ ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసింది. పైగా కొత్త కొత్త ఫీచర్స్ ఈ టీవీ లో వున్నాయి.

కొత్త టెక్ OLED సాంకేతికత సన్నని క్వాంటం డాట్ లేయర్‌తో దీన్ని తీసుకు రావడం జరిగింది. అలనే QD-OLED OLED టెక్నాలజి బ్రైట్నెస్ కూడా పెంచుతుంది. ఈ నెల నుండి ఈ టీవీ “55”, “65” పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది అని కంపెనీ చెప్పింది. ఈ టీవీ ఫీచర్స్ లోకి వెళితే.. S95B QD-OLED బ్రాండ్ నియో క్వాంటం డాట్ 4K ప్రాసెసర్ తో ఇది వచ్చింది. వినియోగదారులు 1080p, 1440p నుండి బూస్ట్ చేస్తున్నప్పుడు వ్యూ పెంచే అధునాతన 4K అప్‌స్కేలింగ్‌ను పొందే అవకాశం కూడా వుంది.

తక్కువ రిజల్యూషన్‌లలో ఉన్న సినిమాలను కూడా చూడడం బాగుంటుంది. S95B HDR10+ తో సహా హై-ఎండ్ HDR ఫీచర్‌లు కూడా ఈ టీవీ కి వున్నాయి. పైగా ఈ టీవీ HDR పని తీరు కూడా బాగుంది. ఇది ఇలా ఉంటే ఈ శాంసంగ్ QD-OLED TV కి నాలుగు HDMI 2.1 స్లాట్‌లను ఇచ్చారు.

S95B ఫుల్ నెక్స్ట్-జెన్ కన్సోల్ సపోర్టివ్‌గా వుంది. అలానే S95B మోషన్ ఎక్సలరేటర్ టర్బో ప్లస్ టెక్ ని కూడా ఈ టీవీ కి వుంది. ఆంటే రెస్పాన్స్ టైమ్ బూస్టింగ్ టెక్నాలజీని కంపెనీ ఇస్తోంది. దీనితో స్మెరింగ్ అండ్ బ్లర్ తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news