ఏడు పదుల వయసులో కూడా క్యాటిరింగ్ చేస్తున్న బామ్మ.. నిజంగా ఆమెని ఆదర్శంగా తీసుకోవాలి..!

-

కష్టపడడానికి సంపాదించడానికి వయసుతో పనిలేదు. వయసు పైబడితే ఖాళీగా కూర్చోవాలి అన్న రూల్ కూడా లేదు. నిజానికి కష్టపడాలని పని చేయాలని అనుకుంటే ఎవరికైనా సాధ్యపడుతుంది. ఏడు పదులు నిండినా సరే ఈ బామ్మ ఒడిశాలోని సంబల్ పూర్ లో క్యాటరింగ్ సర్వీస్ నడుపుతున్నారు. పైగా చాలా మందికి ఉపాధి కూడా ఆమె కల్పిస్తున్నారు.

 

ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఎంతో మంది ఆమెని వెనక్కి లాగాలని చూసినా ఆమె మాత్రం తన మాట మీద నిలబడ్డాడు. అనుకున్న దారిలోనే ఆమె వెళ్లి విజయం సాధించారు. ఆమె పేరు సంతోషిని. తన భర్త పాన్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించే వారు. కానీ అతనికి అనారోగ్యం కారణంగా వ్యాపారాన్ని వదిలి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో సంతోషిని ఏ కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత ఏర్పడింది.

ఒంటరిగా ఆమె కుటుంబ బాధ్యతలు స్వీకరించారు. పిల్లల చదువు, భర్త చికిత్స అన్ని కూడా ఆమె చూసుకున్నారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఆమె భర్త ని కోల్పోయారు. అప్పట్లో క్యాటరింగ్ వ్యాపారాలు చాలా వరకూ పురుషులే చేసేవారు కానీ సంతోషిని మహిళ అయినా సరే క్యాటరింగ్ ని చేశారు. అయితే ఆమె మాత్రం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంది.

కష్ట సమయాల్లో కూడా కానీ ధైర్యంగా పోరాడింది. ప్రస్తుతం సంతోషిని మామ క్యాటరింగ్ బృందంలో దాదాపు వంద మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే వాళ్లలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్లో అయితే ఎప్పుడూ ఎక్కువ పని ఉంటుంది. చక్కగా క్యాటరింగ్ చేస్తూ ఆమె డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ వయసులో కూడా ఇంత కష్ట పడుతున్నారు అంటే నిజంగా ఈమెను ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news