నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారాన్ని హైకోర్టు చాలా సీరియస్సుగా తీసుకోవాలి అన్నారు పయ్యావుల కేశవ్.అసలు కోర్టులో దొంగలు ఎందుకు పడ్డారు.. దేని కోసం ఈ దొంగతనం జరిగిందో చూడాలి.కాకాని ఏ1గా ఉన్న కేసులో డాక్యుమెంట్లు చోరీ కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది అన్నారు.కోర్టులో దొంగతనం అనేది దేశంలో ఇప్పటి వరకు జరగలేదు అన్నారు పయ్యావుల.కోర్టులో డాక్యుమెంట్లు లేకుండా పోతే కోర్టు తీర్పు ఇవ్వలేదనే ఆలోచన చేసినట్లు కనిపిస్తుంది.కోర్టులో డాక్యుమెంట్లు దొంగలించడమనేది న్యాయ వ్యవస్థను, కేసును ప్రభావితం చెయ్యడంగా చూడాలి అన్నారు.
ఈ కేసులో ఏ1గా ఉన్న కాకాని సహా, ఏ2, ఏ3లు బెయిళ్లను రద్దు చేయాలి అన్నారు.కేసులో ఆధారాలుగా ఉన్న ఫోన్లు, ఇతర నివేదికలు మాయమయ్యాయి అని మండిపడ్డారు.కొలంబియాలో బాబ్లో ఎస్కో బార్ అనే కరుడుగట్టిన మాఫియా డాన్ మాత్రమే ఇప్పటి వరకు కోర్టుపై దాడి చేశారు.నెల్లూరులో కొలంబియాలోని బాబ్లో ఎస్కో బార్ ఘటనను గుర్తు చేస్తుంది అన్నారు పయ్యావుల.కోర్టులో దొంగతనం ఘటనను కోర్టు సుమోటాగా తీసుకుని విచారణ చెయ్యాలి.ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి.లేనియెడల ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందని మేం నమ్ముతున్నాం అన్నారు పయ్యావుల కేశవ్.