మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? ఆండ్రాయిడ్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. స్క్రోలింగ్ స్క్రీన్ షాట్స్ తీసుకోవాలని అనుకునేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.వెబ్‌పేజీలు వంటి వాటిని కిందకు స్క్రోల్ చేస్తూ.. నిర్ణీత స్క్రీన్ మొత్తాన్ని ఒకేసారి క్యాప్చర్ చేయడాన్ని స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ అంటారు. ఆ వివరాలు తెలుసుకుందాం.సాధారణంగా అన్ని ఫోన్లలో స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంటుంది. అయితే స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ ఆప్షన్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
షావోమీ, శామ్‌సంగ్ ఆండ్రాయిడ్ బేస్డ్ ఫోన్ లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ, గూగుల్ పిక్సెల్, ఇతర డివైజ్‌లలో ఈ ఫీచర్ లేదు. ఈ ఫీచర్‌ను ఆల్ఫాబెట్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి లాంగ్ స్క్రీన్ షాట్ తీయడానికి వీలుంటుంది. వెబ్‌పేజీ వంటి వాటిని అనేక సార్లు స్క్రీన్ షాట్ తీయడానికి బదులుగా, ఒకేసారి మొత్తం వివరాలను దీని ద్వారా క్యాప్చర్ చేయవచ్చు.
ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రావడానికి కొన్ని నెలల పడుతుంది.
డివైజ్ వాల్యూమ్ డౌన్ బటన్, పవర్ బటన్ ను ఒకేసారి నొక్కి.. లేదంటే స్క్రీన్ మూడు వేళ్లతో కిందకు డ్రాగ్ చేసి తీసుకోవచ్చు.
స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత దాని కింద ఉండే ప్రివ్యూలో ‘క్యాప్చర్ మోర్’ అనే ఆప్షన్ కు వెళ్లాలి. ఇప్పుడు డిస్‌ప్లేపై మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్న మొత్తం పేజీ కనిపిస్తుంది. స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ తీయడానికి.. మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్నంత వరకు స్క్రీన్ పై స్లైడర్‌ని కిందకు డ్రాగ్ చేయండి. ఒక లూప్ కనిపిస్తుంది. దీని ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్క్రీన్ షాట్ తీసుకోవాలో గుర్తించవచ్చు. తర్వాత, డిస్‌ప్లే పై భాగంలో ఎడమ వైపు ‘సేవ్’ బటన్ పై ప్రెస్ చేయాలి.