స్క్రీన్ షాట్స్ ని ఇలా ల్యాప్టాప్ లో ఈజీగా తీయ్యచ్చు తెలుసా..?

-

సాధారణంగా మనం ఫోన్ లో స్క్రీన్ షాట్స్ ని తీసుకుంటూ ఉంటాం. అయితే ల్యాప్‌టాప్‌లో కూడా మనం స్క్రీన్ షాట్ ని తీసుకోచ్చు. విండోస్ 10 మరియు విండోస్ 7 తో రన్ అయ్యే ల్యాప్‌టాప్‌లు ఏదైనా స్క్రీన్‌షాట్‌ను క్యాప్చర్ చేయడానికి ‘స్నిప్పింగ్ టూల్’ అనే ప్రత్యేక అప్లికేషన్‌తో వస్తాయి. దీని హెల్ప్ తో మనం స్క్రీన్‌షాట్ తీసి మీ డివైస్ లో ఇమేజ్ ఫైల్‌గా సేవ్ చేయడానికి అవుతుంది.

దీని కోసం మొదట విండోస్ సెర్చ్ బాక్స్‌లో స్నిప్పింగ్ టూల్ కోసం సెర్చ్ చేసి ఓపెన్ చేయండి.
ఇప్పుడు మీరు క్యాప్చర్ చేయడానికి ‘న్యూ’ ట్యాప్‌పై క్లిక్ చేయండి.
స్క్రీన్‌షాట్‌ను ఎక్కడ నుండి స్టార్ట్ చెయ్యాలో అక్కడ నుండి క్రాస్ ఎయిర్‌ తో ఒక ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కిందికి లాగండి.
ఫైనల్ గా ‘సేవ్ స్నిప్’ ఎంపిక మీద క్లిక్ చేయండి.

స్క్రీన్ షాట్ ఇలా మరెంత ఈజీ:

విండోస్ కీ + ‘PrtScn’ (PrintScreen) బటన్‌ను కలిపి నొక్కడం.
ఇది ఫంక్షన్స్ కీస్ పై వరుసలో ఉంటుంది.
తరువాత సేవ్ బాక్స్ కనిపిస్తుంది.
ఇమేజ్‌కి ఫైల్ కి మీరు పేరు ఇచ్చి సేవ్ చేయవచ్చు.
లేదంటే Windows + Shift+S మూడు కీలను కలిపి నొక్కడం.
మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్న భాగాన్ని ఎంచుకోవడానికి మౌస్ పాయింటర్‌ను డ్రాగ్ చేస్తూ సెలెక్ట్ చేసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news