సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాల స్వాధీనం ఏమిటి?ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అని మండిపడ్డారు పవన్ కళ్యాణ్.ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి….సీఎం జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణీకులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకొనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందన్నారు.
రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ కలిగి.. రూ.7.77 లక్షల కోట్లు అప్పు తెచ్చుకొన్న సామర్థ్యం కలిగిన రాష్ట్రం ఏపీ అని…అలాంటి ఏపీ సీఎం పర్యటనకు ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు తీసుకోవడం ఏమిటి? అని నిలదీశారు.సీఎం భద్రత పర్యవేక్షించే అధికారులు.. కాన్వాయిలో ప్రైవేట్ వాహనాలు అనుమతిస్తున్నారా..?అనుమతిస్తే ఏ ప్రాతిపదికన ఆ వాహనాలు తీసుకొంటున్నారో వివరించాలన్నారు.లక్షల కోట్ల బడ్జెట్, అప్పులు కలిగిన ప్రభుత్వం సొంతంగా వాహనాలు సమకూర్చుకోవలని హెచ్చరించారు.